Home సినిమా శ్రీరెడ్డి మాట పవన్ కు వినబడిందా?

శ్రీరెడ్డి మాట పవన్ కు వినబడిందా?

106
SHARE

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్.. శ్రీరెడ్డి ఇష్యూ అన్నా అది అతిశయోక్తి కాదేమో! రోజుకి ఒకరి బాగోతం బయటపెడుతూ, ఇండస్ట్రీలో పెద్దమనుషులుగా చలామని అవుతున్న చాలా మంది బ్రతుకు చిత్రం ఇదని, మహిళల పట్ల వారి ప్రవర్తన ఇలా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తంది శ్రీరెడ్డి. ఇప్పటికే సురేష్ బాబు కుమారుడి వ్యవహారాన్ని బయటపెట్టి సంచలనాలకు తెరలేపిన శ్రీరెడ్డి… అనంతరం రచయిత కోన వెంకట్ తనను బలవంతం చేశాడని ఆరోపించింది. ఈ విషయాల్లో మద్దతు కూడకట్టుకునే పనిలో బిజీగా ఉన్న శ్రీరెడ్డి.. ఓయూ జేయేసీ మద్దతు సంపాదించిన అనంతరం తాజాగా పవన్ కళ్యాణ్ కు అప్పీలు చేసింది!

“కాస్టింగ్ కౌచ్” పేరుతో సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు సంబందించిన ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ స్పందించాలంటూ కోరింది శ్రీరెడ్డి. “అన్నా.. ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్న ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది.. మీరు స్పందించి దయచేసి తగిన న్యాయం చేయాలని పిలుపునీయండన్నా… ఇంటగెలిచి రచ్చ గెలవాలన్నా, స్టేజీలపై ప్రజల గురించి గొప్పగా మాట్లాడే మీరు ఈ ఇష్యుపై ఒక్కసారి స్పందించాలన్నా” అంటూ పవన్‌ కు అప్పీల్ చేసింది.

అయితే… మిగిలిన విషయాల సంగతి అలా ఉంచితే, సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన పవన్ కళ్యాణ్, శ్రీరెడ్డి అప్పీల్ పై స్పందిస్తారా లేదా అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. శ్రీ రెడ్డి తన అప్పీల్ లో కూడా “ఇంటగెలిచి రచ్చగెలవాలన్నా” అని చిన్నపాటి చురకతో కూడిన సూచన కూడా చేసిన శ్రీరెడ్డి అప్పీల్ ను కచ్చితంగా పవన్ స్వీకరించి స్పందించాల్సిన అవసరం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ పవన్ స్పందిస్తే కర్రా ఇరకగకుండా పాము చావకుండా స్పందిస్తారా లేక సూటిగా స్పందిస్తారా అనేదానిపై కూడా ఆసక్తి నెలకొంది!