Home సినిమా కృష్ణార్జున యుద్ధం మూవీ రివ్యూ

కృష్ణార్జున యుద్ధం మూవీ రివ్యూ

SHARE

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు.
నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమా నానికి మరో హిట్‌ను అందించిందా? మరి ఇక ఆలస్యం దేనికి మన కృష్ణార్జునులు ఏ విధంగా అలరించారో, ఎంతవరుకు ఆకట్టుకున్నారో చదివేసి తెలుసుకోండి.

కథ : 

మొదట చిత్తూరు జిల్లాలోని ఓ విలేజి నేపథ్యంతో మొదలవుతుంది. కృష్ణ (నాని) చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు.
చాలా ముతకగా ఉంటాడు. చదువు సంధ్యలు పెద్దగా అబ్బకపోవడంతో వ్యవసాయ పనులు చేసుకొంటూ కాలక్షేపం చేస్తుంటాడు. అలా సాగుతున్న కృష్ణ జీవితంలోకి రియా (రుస్కర్ మీర్) ప్రవేశిస్తుంది. రియా బాగా చదువుకొన్న అమ్మాయి కావడం, డబ్బున్న కుటుంబానికి చెందడంతో వారి ప్రేమకు పెద్దలు అంగీకారం లభించదు. దాంతో పెద్దలు రియాను హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. చిత్తూరులో కథ ఇలా ఉంటే.. యూరప్‌లోని ప్రాగ్‌లో నివసించే అర్జున్ (నాని) ఓ రాక్‌స్టార్. అమ్మాయిలంటే అర్జున్‌కు ప్రపంచం. అలాంటి జీవితంలో బతికే అర్జున్‌కు సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) తారసపడుతుంది. సుబ్బలక్ష్మిని తొలిచూపులోనే అర్జున్ ప్రేమిస్తాడు. కానీ అర్జున్ ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె అతడి ప్రేమను తిరస్కరించి హైదరాబాద్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకొంటుంది.

హైదరాబాద్‌కు బయలుదేరిన రియా, సుబ్బలక్ష్మిలు ఓ ఆపదలో చిక్కుకొంటారు. కృష్ణ-అర్జున్ ల కథలు ఎలా ముడిపడ్డాయి? కృష్ణ, అర్జున్ వాళ్ళ దారిలో వచ్చిన అవరోధాలను ఎలా అధిగమించారు? వాళ్ళ ప్రేమను ఎలా గెలుచుకున్నారు?

నటీనటుల పెర్ఫార్మన్స్:

ఎప్పటిలాగానే నాని తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. నటనలో తనకున్న ప్రతిభను మరోసారి ఋజువు చేసుకున్నాడు. భిన్న వ్యక్తిత్వాల గల రెండు పాత్రలను తనదైన శైలిలో పోషించి మెప్పించాడు. అనుపమ సుబ్బలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. రుక్సార్ కూడా తన పాత్ర మేరకు బాగానే చేసింది. మిగిలిన తారాగణం కూడా ఎవరికీ వారు వాళ్ళ పాత్రల్లో సరిగ్గా సరిపోయారు. ఇవన్నీ కలిసి కృష్ణార్జున యుద్ధం ని ఓ మంచి చిత్రంగా నిలబెట్టాయి.

ప్లస్ పాయింట్స్ :

హాస్యం
నాని యాక్టింగ్, హీరోయిన్ల నటన, అందం
ఫస్ట్ హాఫ్
‘దారి చూడు’ సాంగ్
బ్రమ్మాజి సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:

కథ, కథనం
సెకండ్ హాఫ్

విశ్లేషణ:

సినిమాలో మొదటి భాగం డీసెంట్ కామెడీతో సరదాగా సాగుతుంది. ముఖ్యంగా కృష్ణ గా నాని కనబరిచిన నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కృష్ణ, అతని స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.
కానీ రెండో భాగంలో కొన్ని సన్నివేశాలను సాగదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. కథ కూడా చూసే ప్రేక్షకుడికి ముందుగానే తెలిసిపోతుంటుంది. కృష్ణుడి పాత్రలో మరోసారి మెరిశాడు. కానీ రాక్‌స్టార్‌గా మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపించ లేకపోవడం సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. నాని నుంచి ఏదో ఆశించే ప్రేక్షకులకు మాత్రం కృష్ణార్జున యుద్ధం కొంత నిరాశను కలిగిస్తుంది. కేవలం మాస్ హీరోగా మెప్పించడానికి, ఎస్టాబ్లిష్ కావడానికి చేసిన ప్రయత్నంగా ఈ సినిమా కనిపిస్తుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ తో మాయ చేసినప్పటికీ ప్రేక్షకుడిని చివరి వరుకు కూర్చోపెట్టడంలో విఫలం అయ్యాడు.

చివరిగా: రొటీన్ డబల్ ఆక్షన్ చిత్రం.