Home రాజకీయాలు బాబు మోసం చేశారు.. భగ్గుమంటున్న చల్లా

బాబు మోసం చేశారు.. భగ్గుమంటున్న చల్లా

SHARE

2014లో టీడీపీ చేరిన కర్నూలు జిల్లా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై భగ్గుమంటున్నారు. సీమలోనే సీనియర్ నేతనైన తనకు ఆర్టీసీ కడప రీజియన్ చైర్మన్‌గా నియమించి చంద్రబాబు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నామినేటెడ్ పదవిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో చేరే సమయంలో ఏకంగా ఎమ్మెల్సీ ఇస్తామన్నారని.. కానీ మూడు సార్లు ఎమ్మెల్సీల నియామకం జరిగినా పదవి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు తనను అవమానించేలా రీజియన్ చైర్మన్ పదవి ఇవ్వడం చాలా బాధకరమన్నారు.

రాయలసీమలో చంద్రబాబు, కేఈ తర్వాత తానే అత్యంత సీనియర్‌నని చెప్పారు. పదవి ఇవ్వపోయినా బాధపడేవాడిని కాదని.. కానీ ఇలా చిన్న పదవి ఇచ్చి అవమానించారని మండిపడ్డారు. ఆర్డీసీ కడపరీజియన్‌ చైర్మన్‌ పదవిని స్వీకరించే ప్రసక్తే లేదన్నారు. అందుకు తన అంతరాత్మ అంగీకరించడం లేదని చల్లా స్పష్టం చేశారు.