Home రాజకీయాలు టీడీపీ ప్రతి తప్పుడు విమర్శకు లెక్కుంటుంది-విజయమ్మ

టీడీపీ ప్రతి తప్పుడు విమర్శకు లెక్కుంటుంది-విజయమ్మ

639
SHARE

తన కుమారుడు వైఎస్‌ జగన్‌ అభిమన్యుడు కాదు.. అర్జునుడేనని వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. తమ వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేని సమయంలోనే ఒంటిచేతులతో సోనియాగాంధీని ఎదురించామని.. ఇప్పుడు ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నప్పుడు కేంద్రానికి ఎందుకు భయపడుతామని విజయమ్మ వ్యాఖ్యానించారు.

వైఎస్‌ కొడుకు చేతిలో కూడా ఓడిపోవాల్సి వస్తుందన్న ఆక్రోశంతోనే టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విజయమ్మ అభిప్రాయపడ్డారు. జగన్‌ను ఉద్దేశించి టీడీపీ నేతలు చేసిన ప్రతి తప్పుడు విమర్శకు దేవుడి వద్ద లెక్క ఉంటుందని.. దానికి టీడీపీ నేతలు సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వస్తుందన్నారామె.

బాబుపై ఆత్మఘోష

చంద్రబాబు రాజకీయాలపై సినిమా తీసేందుకు నట్టికుమార్‌ సిద్దమయ్యారు. ఎన్టీఆర్‌ ఆత్మఘోష పేరుతో వైస్రాయ్ హోటల్ ఉదంతం నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు రాజకీయాన్ని సినిమా చూపిస్తానని ప్రకటించారు.

చిత్రపరిశ్రమ మద్దతు టీడీపీ చేసే ప్రత్యేక హోదా పోరాటానికి ఉంటుందని చెప్పడానికి రాఘవేంద్రరావు, అశ్వినీ దత్, జెమిని కిరణ్, కేఎల్ నారాయణ ఎవరని నట్టికుమార్ ప్రశ్నించారు. ఎంపీ టికెట్లు, ర లాబీయింగ్‌ల కోసమే వారు చంద్రబాబును కలిశారని ఆరోపించారు. టీడీపీ పోరాటానికి చిత్రపరిశ్రమ మద్దతు ఉంటుందంటున్న వారు… ఢిల్లీలో వైసీపీ ఎంపీలు దీక్ష చేస్తుంటే ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెప్పాలన్నారు. సినీ పరిశ్రమలో మొత్తం లక్షమంది ఉన్నారని, వారందరి మద్దతు తెలుగుదేశం పార్టీకి లేదని నట్టికుమార్ వ్యాఖ్యానించారు.

టీడీపీని నాశనం చేయాల్సిందే

టీడీపీని నాశనం చేయకుంటే ఏపీలో కాపులు, దళితులు, ఇతర వర్గాల వారు బతికే పరిస్థితి ఉండదని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఆయన సామాజికవర్గం సంపాదన కోసమే రాష్ట్రం ఉందనుకుంటున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ ఇంటి ముందు స్వయంగా ధర్నా చేయాలని ముద్రగడ సవాల్ చేశారు. అమరావతి నిర్మాణానికి ప్రజలు అప్పు ఇస్తే చంద్రబాబు ఆ సొమ్మును కూడా దోచుకుంటున్నారని ముద్రగడ విమర్శించారు.