Home రాజకీయాలు ఆ రేంజ్ లో దిగజారిపోతున్న టీడీపీ ఎంపీలు!!

ఆ రేంజ్ లో దిగజారిపోతున్న టీడీపీ ఎంపీలు!!

762
SHARE

రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు కానీ మరీ నీతిమాలిన, విజ్ఞత మరిచిన విమర్శలు చేయకూడదు! రాజకీయాలు చేయొచ్చు కానీ మరీ దిగజారుడు రాజకీయాలు చేయకూడదు. జనాలు ఏమనుకుంటారో, సంస్కార హీనులుగా ప్రవర్తిస్తే జనాలు ఛీ అంటారేమో అనే భయం మరిచి అసలు చేయకూడదు. ఎందుకంటే… ఇది ప్రజాస్వామ్యం!! ప్రజలు అన్నీ గమనిస్తుంటారు… కాస్త ఆలస్యం అవ్వొచ్చేమో కానీ, ప్రజలు సరైన సమయం చూసి మొట్టికాయవేస్తే, పాతాళానికి కూరుకుపోవడం ఖాయం! ఈ విషయాలు మరిచిన టీడీపీ ఎంపీలు అధికార గర్వంతోనో లేక అధినేతను నేర్పిన పాటాల్లో భాగంగానో.. విజ్ఞత మరిచిన విమర్శలు చేసి, ప్రజావిమర్శల పాలవుతున్నారు!!

వివరాళ్లోకి వెళ్తే… ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పెద్ద వయసు కావడం, కాస్త అనారోగ్యం గా ఉండటం వల్ల ముగ్గురు వైకాపా ఎంపీలు బలవంతంగా ఆస్పత్రికి తరలించబడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై మనిషన్నవారెవరైనా కాస్త అయ్యో అనాల్సిన పరిస్థితి. ఆ సంగతి అలా ఉంటే… ఈ విషయంపై స్పందించిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మాత్రం.. వైకాపా ఎంపీలవన్నీ డ్రామాలు, ఇప్పటికే మూడు వికెట్లు పడ్డాయి, ఈరోజో రేపో మరో రెండు వికెట్లు పడతాయి, డ్రామాకు తెర దింపేస్తారు అని వ్యాఖ్యానించారు!! ఈ విజ్ఞత మరిచిన కామెంట్స్ పై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మరో టీడీపీ నేత కేశినేని నాని కూడా కొన్ని “ఒళ్లు కొవ్వు” మాటలు మాట్లాడారు!!

వైకాపా ఎంపీలు చేస్తున్న దీక్షలపై స్పందించిన కేశినేని నాని… “వాళ్లు ఒంట్లో కొవ్వు తగ్గించుకోవడానికే ఈ దీక్షలు చేస్తున్నారు.. ఇలాంటి దీక్షలు ఆరోగ్యానికి మంచివే.” అని అన్నారు. ఈ ఒక్కమాట చాలు టీడీపీ నేతలు ఎంత దిగజారిపోతున్నారో చెప్పడానికి! వైకాపా నేతల దీక్షలు వారికి దీక్షలుగా అనిపించకపోతే సైలంట్ గా ఉండొచ్చు, లేదా అవి డ్రామాలు అని తమ వైఖరి వారిపై రుద్ది సరిపెట్టుకోవచ్చు. కానీ… ఇలా దీక్షలు చేస్తే ఒంట్లో కొవ్వు తగ్గడానికి అని చెప్పడాన్ని ఏమనుకోవాలి. నిజంగా అంత కొవ్వు తగ్గడానికే దీక్షలు చేస్తారని అనుకుంటే… టీడీపీ నేతలు ఎంతమంది ఒంట్లో కొవ్వు ఉందో, వారందరితోనూ చేయిస్తే.. వారి ఆరోగ్యం బాగుపడటంతో పాటు, పార్టీకి మైలేజ్ కూడా వస్తుంది కదా. ఈ విషయాలపై నాని ఒకసారి ఆలోచిస్తే బెటరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది ఎవరితో మొదలుపెట్టాలో కూడా నానీనే చెబితే బాగుంటుందని సెటైర్స్ పడుతున్నాయి!! విజ్ఞత మరిచిన కామెంట్స్ విలువలు పోగొడతాయని టీడీపీ నేతలకు ఎప్పటికి తెలుస్తుందో!!