Home రాజకీయాలు ఆహారదీక్ష – నిరాహారదీక్ష… రోజా క్లారిటీ!

ఆహారదీక్ష – నిరాహారదీక్ష… రోజా క్లారిటీ!

360
SHARE

రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడేవారి దగ్గరనుంచి, ఆకరికి రాజకీయ ప్రత్యర్ధి పార్టీల కార్యకర్తలు సైతం శబాష్ అనే స్థాయిలో పోరాడుతున్నారు వైకాపా ఎంపీలు! అయితే.. అధికార గర్వంతో మూసుకుపోయిన నయనాలకు మాత్రం ఈ పోరాటంలో ఉన్న నిజాయితీ, చిత్తశుద్ధి అర్ధం కాక అవాకులూ చెవాకులు పేలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిన్సియర్ గా దీక్ష చేస్తున్న వైకాపా ఎంపీలపై వస్తున్న విమర్శలపైనా, టీడీపీ నేతల నోటి &*%$ పైనా వరుసపెట్టి వాయించుకుంటూ వచ్చారు వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా!

ఫైరవ్వడం మొదలుఎపెడితే ప్రత్యర్ధులకు చుక్కలు చూపించేవరకూ వదిలిపెట్టని రోజా… తాజాగా వైకాపా ఎంపీలు చేస్తున్న దీక్షలపై వెటకారం ఆడిన టీడీపీ ఎంపీలు, చంద్రబాబును కడిగిపారేశినంత పనిచేశారు. ఇందులో భాగంగా… తమ ఎంపీలు చేస్తున్న దీక్షలపై అవాకులు పేళుతున్నవారంతా “ఆహారదీక్షలు” చేస్తుంటారని… పార్లమెంటు ఆవరణలో ఫోటోలకు ఫోజులిస్తూ.. లంచ్ టైం ఎప్పుడు అవుతుందని చూసే టీడీపీ ఎంపీలకు… వైకాపా ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షల గురించి అర్ధం కాకపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదని ఎద్దేవా చేశారు. బోజన సమయం ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూసే టీడీపీ ఎంపీలు.. వైకాపా ఎంపీల గురించి మాట్లాడతారా అని రోజా నిలదీశారు.

ఇదే క్రమంలో కేశినేని చేసిన… “ఒంట్లో కొవ్వు కరగడానికి చేస్తున్న దీక్షలు అవి… ఆరోగ్యానికి మంచిదే” అన్న కామెంట్స్ పై కూడా రోజా ఫైరయ్యారు. నాలుగేళ్లుగా ప్రజాధనాన్ని పందికొక్కులా మేసి కొవ్వు పెంచిన టీడీపీ నేతలు అలాంటి దీక్షలు చేస్తే మంచిది అని చురకలేశారు. కొవ్వు పట్టి బలిసిన నేతలున్న పార్టీ టీడీపీ అనే రేంజ్ లో ఫైరయిన రోజా… ఇదే అదనుగా ప్రత్యేక హోదా పోరాటాన్ని నీరుగార్చడానికి చంద్రబాబు చేస్తున్న పనులు, వేస్తున్న ఎత్తుగడలపై నిప్పులు చెరిగారు.

కుంభకర్ణుడు ఆరునెలలకు ఒకసారైనా నిద్రలేస్తాడు కానీ… నాలుగేళ్లవరకూ నిద్రలేవని కుంభకర్ణుడు చంద్రబాబు… తానేదో సాధించేసినట్లు, తానేదో పోరాడేస్తున్నట్లు తన అనుకూల మీడియాతో నిస్సుగ్గు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటని రోజా నిప్పులు చెరిగారు. గతంలో అన్ని రాష్ట్రాలకంటే మనకే ఎక్కువ నిధులు వచ్చాయి అని, సాధించుకోగలిగాం అని చెప్పుకున్న చంద్రబాబు, ఇప్పుడు మాత్రం కేంద్రం ఏమీ ఇవ్వలేదని చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నించారు. తన ఎంపీలతో రాజినామా చేయించలేని చంద్రబాబు ఏదో ఉద్దరించానని, సాధించానని, సాధిస్తానని చెప్పడం సిగ్గు చేటని రోజా తనదైన శైలిలో ఫైరయ్యారు.

ఏది ఏమైనా.. గత కొన్ని రోజులుగా టీడీపీ ఎంపీలు చేస్తున్న విమర్శలకు సరైన సమాధానాలు వారికి దొరికేసినట్లేనని పలువురు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఎంపీలతో రాజినామాలు చేయించి, ఢిల్లీ వేదికగా పోరాడాలని సూచిస్తున్నారు. కాగా… బస్సు యాత్రకే మాట వినని ఎంపీలు, బాబు మాట విని రాజినామాలు చేస్తారనుకోవడం అత్యాశే అవుతుందని కామెంట్స్ వినిపించడం ఇక్కడ కొసమెరుపు!!