Home సినిమా ‘బిగ్‌బాస్‌ 2’ వార్తలపై స్పందించిన నాని

‘బిగ్‌బాస్‌ 2’ వార్తలపై స్పందించిన నాని

SHARE

జూనియర్ ఎన్టీఆర్, స్టార్‌ మా ‘బిగ్‌బాస్‌’ తెలుగు సీజన్‌ 1లో వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2లో నేచురల్ స్టార్‌ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై నాని స్పందించాడు. ఇంత వరకు తన వద్దకు ఆ ప్రస్తావన రాలేదని, ఒకవేళ వస్తే చెబుతానని సమాధానం ఇచ్చాడు.

కాగా, నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేర్లపాక గాంధీ ఈ సినిమా కథ చెప్పినప్పుడు పూర్తిగా విభిన్నంగా అనిపించిందని, నాగార్జున నటించిన ‘హలో బ్రదర్‌‌’ సినిమాకు, దీనికి సంబంధం ఉండదని, ఆ సినిమాలోలా ఈ సినిమాలో కృష్ణ-అర్జున్‌లు అన్నదమ్ములు కాదని అన్నాడు.

ఈ సినిమాలో కృష్ణార్జునులు కలిసి యుద్ధం చేస్తారని వారు ఎవరిపై, ఎందుకు చేస్తారో థియేటర్లలో చూడండని అన్నాడు. కింగ్ నాగార్జునతో కలిసి ఓ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని అన్నాడు. కాగా, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ తేజ్‌ ‘రంగస్థలం’ విజయం సాధించడం ఆనందంగా ఉందని, ఈ సీజన్‌లో చాలా సినిమాలు వస్తున్నాయని, అన్నీ హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నాడు.