Home రాజకీయాలు రాజీనామా డిమాండ్ కు రోజా సూపర్ పంచ్

రాజీనామా డిమాండ్ కు రోజా సూపర్ పంచ్

1309
SHARE

వైసీపీ లోక్‌సభ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయగా.. టీడీపీ ఎంపీలపైనా రాజీనామా కోసం ఒత్తిడి పెరిగింది. దీంతో టీడీపీ ఎంపీలు ఎదురుదాడి మొదలుపెట్టారు. లోక్‌సభ సభ్యులతో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎందుకు రాజీనామా చేయడం లేదని టీడీపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు.

ఇందుకు ఎమ్మెల్యే రోజా చరిత్ర తవ్వి మరీ కౌంటర్‌ ఇచ్చారు. గతంలో బోఫోర్స్ కుంభకోణం సమయంలో కేంద్రానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ కేవలం లోక్‌సభ సభ్యులతో మాత్రమే రాజీనామా చేయించారని.. రాజ్యసభ సభ్యుల చేత రాజీనామా చేయించలేదని గుర్తు చేశారు.

నాడు ఎన్టీఆర్ పక్కనే ఉన్న చంద్రబాబు ఇందుకు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలోనూ హరికృష్ణకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు… సుజనా చౌదరి చేత మాత్రం రాజ్యసభ సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీశారు రోజా. రాజ్యసభ సభ్యుల చేత రాజీనామా చేయించినా కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి ఉండదన్నారామె. సొంత పార్టీ మెనిఫెస్టోను చూసి భయపడే వ్యక్తి దేశంలో చంద్రబాబు ఒక్కరేనని రోజా ఎద్దేవా చేశారు.

చింతమనేని తన గేదెలను తెచ్చుకుని ఖాళీగా ఉంది కదాని మేలుకున్న అమరావతిని చూపించి చంద్రబాబు ఆనందనగరి అంటూ ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆనందనగరి అంటూ చంద్రబాబు ఒక పనికిమాలిన కార్యక్రమం పెడితే దానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకావడం చాలా దారుణమైన అంశమన్నారు.

వెంకయ్యనాయుడికి బాలకృష్ణ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చేందుకు టైం ఉంటుంది.. చంద్రబాబు పెట్టే పనికిమాలిన ఆనందనగరి కార్యక్రమానికి వచ్చేందుకు టైం ఉంటుంది కానీ.. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించేందుకు మాత్రం సమయం ఉండదా అని రోజా ప్రశ్నించారు