Home రాజకీయాలు జగన్ వ్యూహం.. బాబుకు బొమ్మ కనపడుతుంది!!

జగన్ వ్యూహం.. బాబుకు బొమ్మ కనపడుతుంది!!

SHARE

పోరాటం అంటే ఏమిటో.. కేంద్రంపై పోరాటం విషయంలో వ్యూహం అంటే ఏమిటో 40ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడికి అర్ధమయ్యేలా, కొన్ని సార్లు దిమ్మతిరిగేలా చేసి చూపిస్తున్నారు వైకాపా అధినేత వైఎస్ జగన్. ప్రత్యేక హోదా పోరాటం అంటే.. ఎంపీ పదవులకు రాజినామాలు చేయకుండా, ఢిల్లీలో పసుపు చొక్కాలు వేసుకుని, పచ్చ ఫ్లకార్డులు పట్టుకుని ఫోటోలకు ఫోజులివ్వడం కాదని నిరూపించిన జగన్.. తన ఎంపీలతో రాజినామాలు చేయించి, ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ పోరాటంలో ఇప్పటికే ముగ్గురు ఎంపీలు ఆస్పత్రిపాలు కాగా, మిగిలిన ఇద్దరు ఎంపీలు పోరాడుతున్నారు! ఈ క్రమంలో వారి ఆరోగ్యం కూడా క్షీణించి, వారిని కూడా బలవంతంగా ఆస్పత్రికి తరలించాల్సి వస్తే… ఇక్కడే జగన్ వ్యూహం అభినందనీయమే కాదు, బాబుకు దిమ్మతిరిగే షాక్ కూడా!!

సీరియస్ గా, ప్రాణాలు ఫణంగా పెట్టి, పెద్ద వయసులో, ఆరోగ్యాలు సహకరించకపోయినా కూడా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వైకాపా ఎంపీలపై అవాకులు చెవాకులు పేలారు సుజనా చౌదరి. వైకాపా ఎంపీలది డ్రామా అని, ఇప్పటికే మూడు వికెట్లు పడిపోయాయని, మరో రెండు వికెట్లు పడితే అంతా ముగిసిపోతుందని విజ్ఞత మరిచి మాట్లాడిన సంగతి తెలిసిందే. వారి జ్ఞానం అంతే అని సరిపెట్టుకున్నా, జనాలు మాత్రం ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజో, రేపో మిగిలిన ఇద్దరు వైకాపా నేతలు ఆస్పత్రిపాలైతే.. దీక్షా శిభిరం ఎత్తేయడం కాదు.. అని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తుంది!

ఎంపీలు ఆస్పత్రిపాలైతే.. అనంతరం ఆ స్థానంలో రాజ్యసభ సభ్యులు కూర్చుని ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారట. అనంతరం ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగుతారట. అంటే… తమ ఆశయసాధన ముందు అనారోగ్యం అనేది సాకుగా మారడానికి జగన్ అండ్ కో సిద్దంగా లేరని తెలుస్తుంది. కేంద్రంపై ఏమాత్రం ఒత్తిడి తగ్గనీయకుండా, ఇంతకాలం హోదా పోరాటాన్ని ఎలా బ్రతికి ఉంచారో, అలాగే ఢిల్లీ వీదుల్లో కూడా హోదా పోరాట సెగ తగ్గకుండా జగన్ వ్యూహాలు రచిస్తున్నారట. దీంతో ఇప్పట్లో ఢిల్లీలో వైకాపా ఎంపీల దీక్షా శిభిరం ఎత్తే ఆలోచన లేదన్నమాట.

ఈ రేంజ్ లో జగన్ పోరాట పఠిమ, పట్టువదలని విక్రమార్క నైజం చూసిన జనం అభినందనలు కురిపిస్తుంటే… బాబు అండ్ కో మాత్రం షాక్ కి గురయ్యారంట. జగన్ పోరాటం ముందు, జగన్ వ్యూహాల ముందు బాబు 40ఏళ్ల రాజకీయ అనుభవం తలవంచుకోక తప్పని పరిస్థితి దాపురించిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ వ్యూహంగా చెబుతున్న ఈ విషయం వాస్తవమైతే మాత్రం… ఢిల్లీ వీదుల్లో ప్రత్యేక హోదా పోరాటం సజీవంగా ఉండటమే కాకుండా, కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా… జగన్ చేసిన ఈ వ్యూహానికి బాబుకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడే ఉంటుంది!!