Home రాజకీయాలు వైఎస్ జగన్ అభిమానులకు శుభవార్త!

వైఎస్ జగన్ అభిమానులకు శుభవార్త!

SHARE

నాటి రాజకీయ కారణాలు, పరిస్థితులు ఏమైనా కానీ… వైకాపా అధినేత జగన్ పై కివ్డ్ ప్రోకో అంటూ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రాజకీయ ప్రత్యర్ధులకు ఇది ఒక భారీ వరంగా దొరికింది. ఇందులో వాస్తవవాస్తవాలు చాలా మందికి ఎరుక అనే కామెంట్స్ వినిపిస్తున్నా కూడా అవకాశం చిక్కినప్పుడల్లా జగన్ పై దండెత్తడానికి రాజకీయ ప్రత్యర్ధులకు ఇదొక అవకాశంగా దొరికేది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి కరెక్టుగా బిల్లులు ముట్టచెప్పడమే జగన్ చేసిన నేరం అని, అలా కానిపక్షంలో అసలు కేసే లేదని, ఇది జగన్ నిబద్దత అని ఉండవల్లి వంటివారు గతంలో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో వాస్తవాలు కాస్త ఆలస్యంగా అయినా వెలుగులోకి వస్తాయనే వాదనను రుజువుచేస్తూ… తాజాగా లేపాక్షి హబ్ భూముల కేటాయింపునకు సంబంధించి అప్పటి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డికి తాజాగా హైకోర్టులో ఊరట లభించింది.

వివరాళ్లోకి వెళ్తే… అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు సంబంధించిన కేసులో మురళీధర్ రెడ్డి 12వ నిందితుడు. ఈ కేసు విచారణలో తన ప్రమేయం తేలనందున.. కేసునుంచి తన పేరు కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు.. సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణలో మురళీధర్ రెడ్డి మీద విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే జగన్ కేసులకు సంబంధించి నాటి అధికారులకు కోర్టులో ఊరట లభించడం ఇది తొలిసారి కాదు. ఇప్పటికే చాలా మంది ఐఏఎస్ అధికార్లకు కూడా మినహాయింపు లభించింది.

సీబీఐ విచారణలో ఉన్న కేసులు తమ అధినేతను ఎన్నిరకాలుగా ఇబ్బంది పెడుతున్నాయో, ఎన్నెన్ని అగచాట్ల పాల్జేశాయో ఇంతకాలం అవి అధినేత ఎలా భరించారో తెలిసిన అభిమానులు, ముందు ముందు అవేమైనా ఇబ్బందిగా మారతాయేమో అని అనుమానించిన వైకాపా కార్యకర్తలు, అభిమానులకు నిజంగా ఇది శుభవార్తే. జగన్ చుట్టూ అల్లుకుని ఉన్న కేసుల వలయంలో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క పొర విడిపోతూ వస్తున్న సంఘటనలు తాజాగా జరుగుతున్నాయి. ఈ కేసులో జగన్ సహా విచారణను ఎదుర్కొంటున్న కొందరు ఐఏఎస్ అధికార్లకు క్లీన్ చిట్ దక్కుతోంది. దీంతో క్విడ్ ప్రోకో అంటూ కేసులో నమోదు చేశారు గానీ.. అంతిమంగా లబ్ధి పొందడం ఎక్కడ జరిగిందో.. దాంతో నిందితులకు ఎలాంటి పాత్ర ఉన్నదో నిరూపించడంలో సీబీఐ విఫలం అవుతోందనే విషయం తేటతెల్లమవుతుందనే కామెంట్స్ తాజాగా వినిపిస్తున్నాయి.

కాగా… తండ్రి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వ్యాపారాలు చేయకూడదని రూలేమీ లేదని.. జగన్ ని నమ్మి పెట్టింది పెట్టుబడి అని చెప్పిన ఆయన అదే లంచం అయితే దానికి రసీదు ఇస్తారా..? అని ప్రశ్నించిన ఉండవల్లి… ఇది లంచం కాదు, క్విడ్ ప్రోకో కాదు కనుకనే జగన్ వారికి క్లియర్ గా రసీదులు ఇచ్చారని… ఆ రసీదులు ఇవ్వడం వల్లే ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుపోయాడని చెప్పిన సంగతి తెలిసిందే!