Home రాజకీయాలు ఇటు పోరాటం… అటు పందేరం!

ఇటు పోరాటం… అటు పందేరం!

SHARE

ప్రస్తుతం ఏపీలో “ప్రత్యేక హోదా” హీట్ నడుస్తుంది. నిన్నటివరకూ ప్రత్యేక హోదా చుట్టూ ఏపీ రాజకీయాలు తిరిగితే, జగన్ నిర్ణయాల ఫలితంగా ఏపీ వాసులంతా రాజకీయాలు పక్కనపెట్టి హోదా పోరాటంపై మనసుపెట్టారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఖచ్చితంగా శుభపరిణామం. జగన్ ఇచ్చిన పిలుపుమేరకు, వైకాపా ఎంపీలు చేస్తున్న దీక్ష మేరకు గ్రామాల్లో సైతం ప్రజలు పార్టీలకతీతంగా వైకాపాకు మద్దతు పలుకుతున్నారు.. వారి పోరాటానికి తోడవుతున్నారు. కొందరు టీడీపీ కార్యకర్తలు సైతం తమ పార్టీ నేతల డ్రామాలకు విసుగెత్తి, వైకాపా పోరాటాలకు సంఘీబావం ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. ఢిల్లీలో పరిస్థితి అలా ఉంటే.. బాబు మాత్రం తమ ఆలోచనలు వేరేగా చేస్తున్నారు!

ఇంక ఇప్పట్లో అధికారంలోకి రామనే ఆలోచనో లేక జనాల్లో తమపై ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది అనే నమ్మకమో కానీ… ప్రత్యేక హోదా పోరాటాలు పక్కన పెట్టి మొన్న అమరావతిలో ఆటల పోటీలు పెట్టుకుని సంబరాలు చేసుకున్న బాబు.. తాజాగా పదవుల పందేరానికి తెరలేపారు! పార్టీ నేతలను, కార్యకర్తలను తమవైపుకు తిప్పుకోవడానికో, ఏదోలా కాపాడుకోవడానికో కానీ.. తనపాలనపై విసుగెత్తిన వారు ఎటు వెల్లిపోతారనే భయంతోనో.. నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా తాజాగా 17 సంస్థలకు చెందిన ఛైర్మన్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయం పేరుతో పదవులు ఇచ్చినట్లుగా చెప్పినప్పటికీ.. విధేయులకు, పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారికి పదవుల్ని అప్పగించారనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నయనుకోండి, అది వేరే విషయం!

కాగా.. ఈ విషయాలపై కూడా సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. పరిపాలన అధికారుల మంత్రుల చేతుల్లో పెట్టి, ఢిల్లీ వీదుల్లో సీరియస్ గా పోరాటం చేయండి బాబూ అని ప్రజలు కోరుకుంటుంటే… బాబు మాత్రం రాని హోదా కోసం ఎంతకాలం డ్రామాలు ఆడతామనుకున్నారో లేక ఉన్నదానితో సరిపెట్టుకుని, ఉన్న నాయకులనైనా ఆపుకుందామనో కానీ పదవుల పందేరానికి తెరలేపారు. ఈ పదవుల ఫలితాలను బట్టి, కార్యకర్తల రియాక్షన్స్ బట్టి, జనాల విమర్శలను బట్టి మరికొద్ది రోజుల్లో భారీ ఎత్తున నామినేటెడ్ పదవుల పందేరం జరగనున్నట్లు తెలుస్తోంది.