Home రాజకీయాలు బాబుకు షాక్‌ ఇచ్చిన ఎంపీలు.. జేసీ తీవ్ర వ్యాఖ్యలు

బాబుకు షాక్‌ ఇచ్చిన ఎంపీలు.. జేసీ తీవ్ర వ్యాఖ్యలు

610
SHARE

టీడీపీ ఎంపీలు చంద్రబాబుకు షాక్‌ ఇచ్చారు. నెల రోజులుగా ఎంపీలకు రోజూ ఫోన్లు చేస్తూ అలా చేయండి.. ఇలా చేయండి అంటూ గైడ్‌ చేస్తున్న బాబుకు తొలిసారి ఎంపీల నుంచి ప్రతికూల స్పందన ఎదురైంది.

హోదా కోసం వైసీపీ పోరాటంలో ఎక్కడా వెనక్కు తగ్గకపోవడంతో అందుకు పోటీగా టీడీపీ ఎంపీల చేత బస్సు యాత్ర చేయించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

ఈ ఆలోచనతోనే ఢిల్లీ నుంచి ఏపీకి రావాల్సిందిగా ఎంపీలను ఆదేశించారు. బస్సు యాత్రపై చర్చించేందుకు అమరావతి రావాల్సిందిగా ఎంపీలను ఆదేశించారు. అయితే వారు బస్సు యాత్రకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఇప్పటికే బాబు తీరుతో విసిగిపోయిన ఎంపీలు తమకు కొంచెం టైం కావాలని కోరారు. దీంతో ఎంపీలతో చంద్రబాబు భేటీ వాయిదా పడింది.

బస్సు యాత్ర ప్రతిపాదన తాత్కాలికంగా రద్దయింది. మరోవైపు బస్సు యాత్ర ఆలోచనపై ఎంపీ జేసీ తీవ్రంగా స్పందించారు. అన్ని యాత్రలు ఒకేసారి చేయాలా అని ప్రశ్నించారు. ఇప్పుడే కదా ఢిల్లీ నుంచి వచ్చాం… అప్పుడే బస్సు యాత్ర అంటే ఎలా అని ప్రశ్నించారు. మాకు కుటుంబాలు ఉంటాయి కదా వాటి సంగతి చూసుకోవద్దా అని జేసీ ప్రశ్నించారు.