Home రాజకీయాలు మార్పుపై కాటసాని సమావేశం

మార్పుపై కాటసాని సమావేశం

1484
SHARE

పాణ్యం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు రాబోతున్నారు.. ఈ విషయంపై కార్యకర్తలతో చర్చించేందుకు ఈనెల 18న ఆయన కర్నూలులో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

కాటసాని వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. అయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన గౌరు చరిత ఉన్నారు. ఈనేపథ్యంలో మరో నియోజకవర్గం కేటాయించేందుకు వైసీపీ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

సీటు విషయంలో స్పష్టత వస్తే ఆయన వైసీపీలో చేరడం దాదాపు ఖాయమని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాటసాని ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో టీడీపీ అభ్యర్థి పార్థసారథి చేతిలో ఓటమి చవిచూసిన కాటసాని.. 2004లో అదే పార్థసారథిని ఓడించారు.

2009లో టీడీపీ అభ్యర్థి భైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై 8,914 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పాణ్యం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన కాటసాని 30వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.