Home రాజకీయాలు అవి సరిపోతాయి… బాబు ప్లాన్ ఇదే!

అవి సరిపోతాయి… బాబు ప్లాన్ ఇదే!

317
SHARE

ప్రస్తుతం పోరాటం అంతా ఏపీకి ప్రత్యేక హోదా కోసం మాత్రమే.. రాజకీయాలకు ఇప్పుడు తావులేదు.. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది.. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి! ఇందులో భాగంగా బాబు ఢిల్లీ వెళ్లారు ఫోటోలకు ఫోజులిచ్చారు.. టీడీపీ ఎంపీలు రకరకాల వేషదారణలతో, డ్రామాలతో పోరాటం అని పేరుచెప్పి కాలయాపన చేశారు. తాజాగా ప్రధాని ఇంటికెళ్తాం అని అరెస్టు అయ్యారు! ప్రధాని ఇంటిముట్టడికి వెళ్తే.. రెండు కిలోమీటర్ల ముందే వారిని అరెస్ట్ చేస్తారని వారికి తెలియదా? డ్రామాలు కాకపోతే.. అని వినిపిస్తున్న కామెంట్స్ సంగతి అలా ఉంటే… ఢిల్లీలో ప్రత్యేక హోదా గురించి పోరాటం చేసినట్లు చెప్పుకోవడానికి, ఏపీలో ప్రచారానికి సరిపడా ఫోటోలు సంపాదించేశాం.. ఇక ఏపీకి వచ్చేయండి అనే రేంజ్ లో బాబు తమ ఎంపీలకు ఆదేశాలు జారీచేసేశారు. ఇక ఏపీలో ఎన్నికల ప్రచారమే అన్నది టీడీపీ భావనగా ఇక్కడ కనిపిస్తుంది.

పోరాటం అంటే.. దానికి ఒక ప్రణాళిక ఉండాలి, పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లాలి. లోకల్ లీడర్లు, కార్యకర్తలు రాష్ట్రంలో ప్రజలకు సమస్యలు చెబుతూ, ఆ వేడి ఢిల్లీకి తగిలేలా పోరాటం చేయాలి! ఎంపీలు, బడా నేతలు మాత్రం ఎక్కడ పోరాడితే ఫలితం వస్తుందో అక్కడ పోరాడాలి! ఇది కనీస అవగాహన. ఈ విషయాలు గ్రహించిన వైకాపా అధినేత తనకు తాను ఇటు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటే.. నియోజకవర్గ స్థాయి నేతలు ప్రతీ గ్రామంలోనూ, మండలంలోనూ తమతమ పోరాటాలు, దీక్షలు చేస్తూ ఉంటే.. ఢిల్లీ పంపిన ఎంపీలు ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తున్నారు. ఇది పోరాటానికి సరిపడా పక్కా ప్లాన్. కానీ… బాబు మాత్రం ఏపీలొ ప్రచారానికి సరిపడా ఫోటోలు సంపాదించేసుకుని, తమ ఎంపీలను రాజినామాలు చేయనియ్యకుండా అమరావతికి పిలిపించేసుకున్నారు!!

ఇందులో భాగంగా… ఈనెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని, హోదా కోసం తము చేసిన పోరాటాని జనాలకు త్రీడీలో చూపించాలని బాబు అండ్ కో ప్లాన్ చేశారు. అనంతరం ప్రతీ జిల్లాలోను ఒక సభ ఏర్పాటు చేసి, ఆ సభకు చంద్రబాబు కూడా హాజరయ్యి.. బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ప్రసంగించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదే క్రమంలో ఢిల్లీ లో చేసిన టీడీపీ మార్కు పోరాటాలకు సంబందించిన ఫోటోలను బస్సులకు అంటించి, బస్సు యాత్రలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మనకు ప్రచారం ముఖ్యం.. పోరాటం కాదు.. అనే సంకేతాలిచ్చేలా ఢిల్లి నుంచి తమ ఎంపీలను రాష్ట్రానికి రప్పించేస్తున్నారు చంద్రబాబు.

దీంతో ఇప్పటికే పీకల్లోతు వ్యతిరేకతను మూటగట్టుకున్న చంద్రబాబు… ఇంతకాలం చేసిన పరిపాలన, జనాలకు ఇచ్చిన వాగ్ధానాలను ఎగవేసిన విషయం, మహిళలకు చేసిన అన్యాయం, ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అమరావతి పేరు చెప్పి చేసిన కాలయాపన, నిరుద్యోగ భృతి ఎగవేసిన క్రమం… ఇలా అన్ని విషయాలను జనాలు మరిచారు అనే భ్రమలో కేవలం ప్రత్యేక హోదా పేరు చెప్పి, దానికోసం తామంత ఢిల్లీలో మామూలు పోరాటం చేయలేదని చెప్పుకుంటూ, బీజేపీపై నేరం మొత్తం మోపి రాబోయే ఎన్నికల ప్రచారానికి ముందస్తుగా తెరతీశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.