Home రాజకీయాలు అఖిలప్రియ గెంటేసిన ఏవీ సుబ్బారెడ్డి

అఖిలప్రియ గెంటేసిన ఏవీ సుబ్బారెడ్డి

SHARE

భూమా అఖిలప్రియకు   ఏవీ సుబ్బారెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా నంద్యాల సిటీ కేబుల్‌ నుంచి భూమా ఫ్యామిలీని గెంటేశారు.

నంద్యాల సిటీ కేబుల్‌లో భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిల వార్తలను నిషేధించారు సుబ్బారెడ్డి. దీనిపై మండిపడ్డ అఖిలప్రియ చానల్ మేనేజర్‌కు ఫోన్ చేయగా… ఏదైనా ఉంటే సుబ్బారెడ్డితో మాట్లాడుకోవాలని స్పష్టం చేశారు.

తొలుత అఖిలప్రియ వార్తలను మాత్రమే సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల సిటీ కేబుల్ చానల్‌లో బ్యాన్ చేశారు. దీనిపై బ్రహ్మానందరెడ్డి నిలదీగా… అప్పటి నుంచి బ్రహ్మానందరెడ్డి బొమ్మను కూడా నిషేధించారు. చానల్‌ మేనేజర్‌కు ఫోన్ చేసిన అఖిలప్రియ చానల్‌లో తమకూ 50 శాతం వాటా ఉందని చెప్పినా లెక్కచేయలేదు.

నంద్యాల సిటీ కేబుల్‌ నుంచి భూమా కుటుంబాన్ని ఏవీ సుబ్బారెడ్డి గెంటేసిన విధానంపై భూమా అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పటికీ అఖిలప్రియకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.