Home రాజకీయాలు బాబు రాయబారం చేసినా .. టీడీపీకి ఎదురుదెబ్బ

బాబు రాయబారం చేసినా .. టీడీపీకి ఎదురుదెబ్బ

2514
SHARE

బెజవాడ టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. సుజనా చౌదరి బంధువు, మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి వైసీపీలో చేరేందుకు ముహూర్తం ప్రకటించారు. ఈనెల మొదట్లోస్వయంగా చంద్రబాబు పిలిపించుకుని ఎమ్మెల్సీ ఇస్తామని బుజ్జగించినా సరే యలమంచలి రవి మాత్రం నిర్ణయం మార్చుకోలేదు.

సోమవారం పాదయాత్రలో ఉన్న జగన్‌ను యలమంచలి రవి కలిశారు. పార్టీలో చేరేందుకు సిద్ధమని వెల్లడించారు. జగన్‌ కూడా యలమంచలిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈనెల 16న ఆయన జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. చంద్రబాబుతో చర్చల తర్వాత యలమంచలి రవి పార్టీ వీడే ఆలోచనమానుకున్నారని టీడీపీ నేతలు భావించారు.

కానీ సీఎం బుజ్జగింపులు జరిపినా సరే రవి వైఎస్‌ జగన్‌ను కలవడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. పీఆర్పీనుంచి గతంలో విజయవాడ వెస్ట్‌ నుంచి పోటీ చేసిన యలమంచలి రవి.. దివంగత దేవినేని నెహ్రును ఓడించారు.

పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో 2014కు ముందు టీడీపీలో చేరారు. కానీ టికెట్ ఇవ్వలేదు. కనీసం పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా అవమానించారు. దీంతో ఆయన పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. సుజనా, చంద్రబాబు బుజ్జగించినా సరే ఫలితం లేకపోయింది.