Home సినిమా నా బుతుకు బస్టాండ్ చేశారు: శ్రీరెడ్డి సంచలన కామెంట్

నా బుతుకు బస్టాండ్ చేశారు: శ్రీరెడ్డి సంచలన కామెంట్

SHARE

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద ఆరోపణలు చేస్తూ బట్టలిప్పి అర్దనగ్న ప్రదర్శనకు దిగిన శ్రీరెడ్డిపై ‘మా’ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పనులు చేసిన ఆమెకు ఎట్టిపరిస్థితుల్లోనూ సభ్యత్వ కార్డు ఇవ్వబోమని, ఏమె ఏదైనా సినిమాలో నటిస్తే అందులో ‘మా’ లోని సభ్యులు నటించబోరని తీర్మాణించింది.

శ్రీరెడ్డి ‘మా’ తనపై తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. ఓ టీవీ ఛానల్‌తో ఆమె మాట్లాడుతూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నాది చీప్ పబ్లిసిటీ అంటున్నారు. కేవలం పబ్లిసిటీ కోసం నేను ఇలా చేస్తున్నాను అంటున్నారు. నాలుగు సినిమాలు చేస్తే నాకు పబ్లిసిటీ వస్తుంది. అవే ఉంటే నేను ఇలా బట్టలిప్పుకోవాల్సిన అవసరం ఏమిటి అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.

నా బట్టలు నేను ఊడదీసుకోలేదు. ఇండస్ట్రీ పరువు మీ చేతులతో మీరే తీసుకున్నారు. తెలుగు కళామ తల్లి గుడ్డలు మీరు ఊడదీశారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ రోజు మీరు ఎలాంటి మెసేజ్ పంపారు? మేము పెత్తందార్లం, మేమే చెప్పినట్లు వినాలి. మేము చెప్పినట్లు ఆడాలి అంటూ నన్ను పర్సనల్‍‌గా టార్గెట్ చేశారు, ఆర్టిస్టులను తొక్కేసే అధికారం మా అసోసియేషన్‌కు లేదు అని శ్రీరెడ్డి మండి పడ్డారు.

‘మా’ సభ్యులంతా కలిసి నా బ్రతుకును బస్టాండ్ చేసి వదిలారు. ఇకపై ఏం చేయదులచుకున్నారో చేయండి. మీకు భయపడే చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. నేను కూడా ఆత్మహత్య చేసుకునేలాగా లేడీస్‌ను నా మీదకు ఉసిగొల్పుతున్నారు. నన్ను దారుణంగా టార్గెట్ చేయించారు… అని శ్రీరెడ్డి అన్నారు.

నేను నిన్న ఆ పని చేశానంటే ఇష్టంగా చేసిన పని కాదు. నేను ఎంతో బాధ పడి అలా చేయాల్సి వచ్చింది. నాకు జరుగుతున్న అన్యాయంపై ఎవరూ స్పందించడం లేదు. అందుకే ఏ దారి లేక అలా చేయాల్సి వచ్చింది అని శ్రీరెడ్డి అన్నారు. నేను చేసిన పనిని మా సభ్యులు విమర్శిస్తున్నారు.

ఫ్యామిలీస్, పిల్లలు చూడలేక పోతున్నారని అంటున్నారు. చలువ కళ్లద్ధాలు పెట్టుకుని నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఉత్తరాది హీరోయిన్లను తీసుకొచ్చి మీ సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌ చేయిస్తున్నారు సిగ్గు అనిపించడం లేదా? మీరు చేసే సినిమాలు చిన్నపిల్లలు చూసే విధంగా ఉంటున్నాయా? పిల్లలున్నారని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని శ్రీరెడ్డి మండి పడ్డారు.

శ్రీరెడ్డి కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలోని పరిస్థితులపై సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. శ్రీరెడ్డి అర్దనగ్న ప్రదర్శనకు దిగడం నేషనల్ మీడియా సైతం కవర్ చేసింది.