Home రాజకీయాలు ఏబీపై వేటు?

ఏబీపై వేటు?

2524
SHARE

ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. ఆయనపై బదిలీ వేటు వేసేందుకు సిద్దమవుతున్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబు ఆ తర్వాత అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై వేటు వేశారు.

తన ఫోన్‌ కాల్స్‌ను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్‌ చేస్తున్నా పసిగట్టలేకపోయారంటూ ఆమెపై వేటు వేశారు. అనంతరం చంద్రబాబే ఏరికోరి ఏబీ వెంకటేశ్వరరావును తెచ్చుకున్నారు. కానీ పవన్‌ కల్యాణ్, ఆక్వా ఫుడ్‌ పార్క్‌ ఆందోళనల విషయంలో సరిగా పనిచేయలేదని ఏబీపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు.

పవన్‌ కల్యాణ్ గుంటూరు సభలో టీడీపీకి అనుకూలంగా ఉంటారంటూ చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే తీరా సభలో పవన్‌ కల్యాణ్ చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయం అంటూ దులిపేశారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన విషయాన్ని గుంటూరు సభలో ఆయన ప్రసంగం వినే వరకు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కనిపెట్టకపోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

అందుకే ఏబీని తొలగించి మరొకరిని ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తెచ్చుకోవాలని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఏబీ కూడా తనను ఇంటెలిజెన్స్ నుంచి తప్పించాలని చంద్రబాబును కోరారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.