Home రాజకీయాలు హీరో శ్రీకాంత్‌పై శ్రీరెడ్డి ఫైర్

హీరో శ్రీకాంత్‌పై శ్రీరెడ్డి ఫైర్

SHARE

చిత్రపరిశ్రమలో ఆడవాళ్లపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న నటి శ్రీరెడ్డిని మా అసోసియేషన్‌ బహిష్కరించడంపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి.  శ్రీరెడ్డిని చిత్రపరిశ్రమ నుంచి వెలి వేయడంపై సామాజికవేత్త దేవి తీవ్రంగా స్పందించారు.   శ్రీరెడ్డి మాటలు వినేందుకుకూడా ”మా” ఎందుకు సిద్దపడలేకపోయిందన్నారు.

అసలు ఆమె రోడ్డు మీదకు వచ్చేలా పరిస్థితి సృష్టించి.. ఇప్పుడు బజారులో కూర్చున్నావ్ కాబట్టి సభ్యత్వం ఇవ్వబోమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. శ్రీరెడ్డి బట్టలూడదీస్తే ”మా” ఇంతగా ఎందుకు సిగ్గుపడుతోందో అర్థం కావడం లేదన్నారు. అసలు సినిమావాళ్లు బతుకుతున్నదే ఆడవాళ్ల బట్టలూడదీయడం మీదే కదా అని దేవి ప్రశ్నించారు. సినిమాల్లో కంటే దారుణంగా శ్రీరెడ్డి ఏం చూపించిందని దేవి ప్రశ్నించారు. బట్టలూడదీసుకుని కుర్చుంటే తప్ప స్పందించని స్థాయికి ”మా” ఎందుకు దిగజారిందో ఆలోచించుకోవాలన్నారు.

హీరో శ్రీకాంత్‌పైనా శ్రీరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శనను చూసి ఇంట్లో పిల్లలు భయపడిపోయారని.. తాను సిగ్గుపడ్డామని ప్రెస్‌మీట్‌లో శ్రీకాంత్‌ చెప్పడాన్ని శ్రీరెడ్డి ప్రశ్నించారు.   శ్రీకాంత్‌ ను ఉద్దేశించి.. చలవకళ్లద్దాలు పెట్టుకుని మాట్లాడుతున్న ఆయన చేసే సినిమాల వల్ల పిల్లలకు సిగ్గు వేయడం లేదా?, నార్త్‌   నుంచి అమ్మాయిలను తెచ్చి ఎక్స్‌పోజింగ్ చేయించినప్పుడు సిగ్గు వేయడం లేదా?, ఫ్యామిలీలు ఉన్నాయని చెబుతున్నారే.. మరి పెళ్లిళ్లు అయినా సరే వేరు మహిళలతో మూతులుమూతులు నాక్కోడానికి సిగ్గేయడం లేదా అని శ్రీకాంత్‌ ను ప్రశ్నించారామె?. మీరు యాక్ట్ చేసేటప్పుడు మీ ఇంట్లో పిల్లలు గుర్తుకు రాలేదా?, మీ సినిమాలన్ని మీ పిల్లలు చూసేలాగే ఉన్నాయా అని హీరో శ్రీకాంత్‌ ని శ్రీరెడ్డి ప్రశ్నించారు.