Home రాజకీయాలు ఐదుకోట్ల మంది కోసం ఐదుగురు!

ఐదుకోట్ల మంది కోసం ఐదుగురు!

SHARE

ఐదుకోట్ల జనం కోసం ఐదురుగు ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంఘటన స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతుందన్నా అతిశయోక్తికాదేమో! ప్రజలకు ఇచ్చిన మాటమేరకు, అధినేత ఆశయాలమేరకు, రాష్ట్ర భవిష్యత్తు కోరకు… ఆమరణ నిరాహార దీక్షకు దిగారు వైకాపా ఎంపీలు. రాజకీయ నాయకులు ఇచ్చిన మాటలు, చేసిన వాగ్ధానాలపై ప్రజలకు నమ్మకాలు సన్నగిళ్లుతున్న ఈ రోజుల్లో… ఇచ్చిన మాటకోసం, చేసిన వాగ్ధానం కోసం రాజీలేని పోరాటానికి సిద్దపడ్డారు వైకాపా ఎంపీలు. అధినేత జనాల్లో ఉంటే.. ఎంపీలు జనంకోసం నిలబడ్డారు. అధినేత ఆదేశాల మేరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు!

ఈ సమయంలో తమ ఎంపీలు చేస్తున్న పోరాటంపై అధినేత జగన్.. హర్షం వ్యక్తం చేశారు. నేతల త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని జగన్ వ్యాఖ్యానించారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల కోసం ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన వెంటనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించారు.

అధినేత అభినందనలు అలా ఉంటే… ఎంపీలు చేస్తున్న ఈ దీక్షలకు ప్రజలనుంచి అభినందనల వెళ్లువలు వస్తున్నాయి. జనాలకు ఇచ్చిన మాటకోసం వైకాపా ఎంపీలు చేస్తున్న త్యాగాలు, దీక్షలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరిని ఎంపీలుగా ఎన్నుకున్నందుకు గర్వపడుతున్నారు. ఇదే క్రమంలో 75 ఏళ్ల వయసులో ఆమరణ దీక్షను చేస్తూ, అనారోగ్యానికి గురైనా వెనక్కితగ్గని మేకపాటి తీరు మరింత అభినందనీయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పోరాటాలంటే ఇవని, విమానాల్లో తిరుగుతూ, సైకిల్ పై సవారీలు చేస్తూ ఫోటోలకు ఫోజులివ్వడం కాదనే కామెంట్స్ సర్వత్రా వ్యక్తమవడం గమనార్హం!!