Home రాజకీయాలు కర్నాటక ఎన్నికలతర్వాత కష్టమేనన్న బాబు

కర్నాటక ఎన్నికలతర్వాత కష్టమేనన్న బాబు

SHARE

ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడుఏం జరుగుతుందోనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళనచెందుతున్నారు. ఒక్కోసారి ఆయనలోని భయం బయటకు వచ్చేస్తోంది.

శనివారం జరిగిన అఖిలపక్ష భేటీలో చంద్రబాబు వ్యాఖ్యలు విని అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పటికే పదేపదే తనపై కేసులుపెడుతారా అంటూ ఎవరు చెప్పకముందే ప్రశ్నిస్తున్న చంద్రబాబు.. కర్నాటక ఎన్నికల ముగిసిన తర్వాత ఇబ్బందులుతప్పవనివ్యాఖ్యానించారు.

కర్నాటక ఎన్నికలు ముగియగానే కేంద్ర పెద్దలు ఏపీపై ఫోకస్ పెడుతారని అప్పుడు మరిన్ని వేధింపులుంటాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యక్తం చేసిన భయాన్ని చూసి సమావేశానికి వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. కేంద్రం నుంచి ఎలాంటి వేధింపులుంటాయన్న విషయాన్ని చంద్రబాబు స్పష్టంగా చెప్పకపోయినా.. ఆయన చెప్పిన దాని బట్టి బీజేపీ పెద్దలు బాబుపై ఫోకస్ పెట్టినట్టుగానే ఉందని భావిస్తున్నారు.

కర్నాటక ఎన్నికలకు ముందే ఆపరేషన్‌ బాబు ప్రారంభిస్తే… దక్షణాది సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే సంయమనం పాటిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.

చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం, ఏపీలో అవినీతి, పోలవరం, రాజధాని కుంభకోణాలపై ఇప్పటికే కేంద్రం వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతున్న వేళ.. చంద్రబాబు కూడా కర్నాటక తర్వాత మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్పడం బట్టి ఏపీ ముఖ్యమంత్రిలో అభద్రతాభావం బలంగానే ఉన్నట్టు కనిపిస్తోంది.