Home రాజకీయాలు 2019కి బాబు రెడీ చేసుకున్న కొత్త బిస్కెట్!!

2019కి బాబు రెడీ చేసుకున్న కొత్త బిస్కెట్!!

3008
SHARE

జనం అంతా ప్రత్యేక హోదా కోసం చూస్తుంటే… జగన్ అండ్ కో హోదా కోసం పోరాడుతుంటే… బాబు మాత్రం రాబోయే ఎన్నికల్లో ఏ మాయమాటలు చెప్పాలి, ఎలాంటి బిస్కెట్లు రెడీ చేసుకోవాలి అనే పథకాల రచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించకపోవడమే బాబు తనపాలనలో చేసిన ఘోర తప్పిదాల్లో, అత్యంత అన్యాయాల్లో మొదటిదనే విషయం మరిచిన బాబు.. అదే విషయాన్ని అడ్డుపెట్టుకుని రాబోయే ఎన్నికల్లో జనాలను మరోసారి ఏమార్చాలని చూస్తున్నట్లుగా ఉంది!

గతంలో మోడీ గాలిని అనుకూలంగా మలచుకుని “బాబు-మోడీ ద్వయం.. రాష్ట్రానికి వరం” అని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం నాలుగేళ్లు కాలయాపన చేసిన బాబు.. అనంతరం మోడీతో చెడి, రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింది, మోడీని నమ్మాను పని అవలేదు అని చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జాతీయస్థాయిలో బీజేపీ తప్ప అన్ని పార్టీలు ఏపీకి అనుకూలంగా ఉన్నాయని చెబుతున్న బాబు.. ఆ దిశగా ప్రజలను ఏమార్చేపనికి పూనుకోవడానికి పథకాలు రచిస్తున్నారు. ప్రస్తుతం హోదా కోసం ఢిల్లీ వెళ్లి రాజినామాలు చేసి పోరాడండి, దేశం మొత్తం మనవైపు చూస్తుంది అని జగన్, జనాలు చెబుతుంటే… బాబు మాత్రం రాబోయే ఎన్నికల్లో ఎంపీ సీట్లపై బిస్కెట్లు రెడీ చేసుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లను గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు అనే లీకులు విడుదల చేస్తున్నారు. మోడీ అన్యాయం చేశారు కానీ.. ఈ సారి మాత్రం చంద్రబాబు తనదైన శైలిలో కేంద్రంలో చక్రం తిప్పుతారని, దానికి బాబుకు ఏపీ నుంఛి ఉన్న మొత్తం 25 ఎంపీ స్థానాలు ఇస్తే చాలని ప్రచారం చేయిస్తున్నారు. ఇక్కడ బాబు గమనించాల్సిన విషయం ఒకటుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బాబుని చూసి కాకుండా, బాబు అనుభవాన్ని, మోడీతో ఉన్న స్నేహాన్ని చూసి జనం ఓట్లేశారని!!

ఈస్థాయిలో బాబుని నమ్మిన జనాలు 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిపిస్తే.. బాబు తనకు తాను చేసిన వాగ్ధానాలనే నెరవేర్చలేని పరిస్థితి. ఇచ్చిన మాటలు చేసిన వాగ్ధానాలు అటకెక్కించిన వైనం. తాను జనాలు అనుకుంటున్నట్లు సీనియర్ నే కానీ తనవల్ల ఏమీ కాదని, తనకు చేతకాదని, చేవలేదని, ఢిల్లీలో తన స్థాయి చాలా చిన్నదని చెప్పకనే చెప్పారు ఈ నాలుగేళ్ల పాలనలో!! ఈ క్రమంలో మరోసారి తనను గెలిపిస్తే ఈసారి కేంద్రంలో చక్రం తిప్పి హోదా తెస్తారంట. ఏపీ వాసుల్లో 10% జనాలకైనా ఈ మాట ఆమోదయోగ్యం కాదనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్న తరుణం ఇది. ఈ లీకులు గమనించినవారుమాత్రం… బాబు మరోసారి ప్రజలను ఏమార్చేపనికి పూనుకుంటున్నారని, అప్పుడే రాజకీయాల్లోకి, రాబోయే ఎన్నికల్లోకి వెళ్లిపోయిన బాబు.. ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారే తప్ప.. ప్రస్తుతం తాను చెబుతున్న హోదా పోరాటం అనేది శూన్యం అని చెప్పకనే చెబుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!!

ఒకవేళ బాబు మాట నమ్మి.. మరోసారి అధికారం కట్టబెడితే.. కేంద్రం మొసం చేసింది అని మరోసారి చెప్పరనే గ్యారెంటీ ఏమిటి? నేరం నాది కాదు కేంద్రానిది అని అనరని గ్యారెంటీ ఏమిటి? అంత స్నేహం ఉన్న మోడీ, అంత పాత మిత్రులైన బీజేపీ నుంచే బాబు ఏమీ సాధించలేని క్రమంలో.. మరో గత్యంతరంలేక ఆటలో అరటిపండులా చేరబోయే మరో జాతీయపక్షం నుంచి బాబు ఏవో సాధించి రాష్ట్రానికి తెస్తాననడం హాస్యాస్పదం కాకమరేమిటి!!