Home రాజకీయాలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు మద్దతుగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కువైట్ సంఘీభావం

ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు మద్దతుగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కువైట్ సంఘీభావం

SHARE

కువైట్ : రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుప్రత్యేక హోదాతోనే సాధ్యమని జననేత జగన్ గారి అదేషానుసారం తమ పార్లమెంట్ సభ్యత్వం తృణ పాయంగా భావించి రాజీనామాలు చేయడమేకాక తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన…వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ యంపిలకు మద్దతుగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కువైట్ సభ్యులు సంఘీభావం తెలియ చేశారని వైకాపా కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భముగా బాలిరెడ్డి గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇక సమిసి పోయిన అధ్యాయం అని చెప్పిన తెలుగుదేశం నాయకుల చేతనే ప్రత్యేక హోదా నినాదం పలికించిన నాయకుడుజననేత జగన్ మోహన్ రెడ్డిగారని ఈ రోజు ప్రత్యేక హోదా సజీవంగా ఉందంటే ఒకే ఒక నాయకుడు జగన్ మోహన్ గారేనని వారి ఆదేశానుసారం సుమారు 15 నెలల సమయమున్న ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు తృణ ప్రాయంగా త్యజించి ప్ర్రాణాలను సైతం లెక్క చేయకుండా పార్టీ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామాలు చేసిన పార్లమెజ్మ్ట్ సభ్యులకు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యుల తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపినరు.

కో కన్వీనర్లుగోవిందు నాగరాజు, యం .వి. నరసా రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా ఒక నాయకుడు ఆంధ్రకు 10 సం:లు అవసరమని చెప్పాడం. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ. వేంకటేశ్వర స్వామి సాక్షిగా అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో వాళ్ళ నాయకుడు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సం: ఇస్తామని హామీ ఇవ్వడం నాటకాల రాయుడు చంద్రబాబు గారు ఒక అడుగు ముందుకేసి 10 సం:లు కాదు 15 సం:లు ప్రత్యేక హోదా కావాలని ఆనడం అధికారంలో వచ్చిన తర్వాత ఉసారవెల్లి రంగులు మార్చినట్లు ప్రత్యేక హోదాపై మాటలు మార్చినటువంటి నాటకాల నాయకుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్ర ప్రజల దురదృష్టమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమములో ప్రధాన కొసశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి, బి.సి. ఇంచార్చ్ కె. రమణ యాదవ్, రవింద్ర నాయుడు, సలహాదారుడు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, యూత్ ఇంచార్చ్ మర్రి కళ్యాణ్, ఎస్సి. ఎస్టీ. ఇంచార్చ్ బి. యెన్ . సింహా , కోశాధికారి పిడుగు సుబ్బారెడ్డి, యూత్ సభ్యుడు బాల కృష్ణ రెడ్డి, సేవాదళ్ వైస్ ఇంచార్చ్ కె. నాగసుబ్బారెడ్డి, మరియు సుబ్బయ్య తదితరులు పాల్గోన్నారు.