Home రాజకీయాలు బాబుకు ముందు నుయ్యి, వెనక గొయ్యి మిగిల్చిన జగన్!

బాబుకు ముందు నుయ్యి, వెనక గొయ్యి మిగిల్చిన జగన్!

1469
SHARE

ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో జగన్ దూకుడు, టీడీపీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తుందనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో… తాజాగా జగన్ తన పోరాట పఠిమలో ఉన్న నిజాయితీని, మాట తప్పని వైనాన్ని చెప్పకనే చెబుతూ తమ ఎంపీలతో రాజినామాలు చేయించిన సంగతి తెలిసిందే. అనంతరం పోరాటాన్ని తీవ్రరూపం దాల్చే క్రమంలో ఆమరణిరాహాదరీక్షకు కూర్చున్న సంగతి తెలిసిమే. దీంతో వైకాపా నెతల పోరాటంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురుస్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం అడ్డగోలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. రాజినామాల వల్ల ఒరిగేది ఏమీ లేదని సైడైపోతున్నారు. బాబుకు అర్ధం కావడం లేదో లేక అర్ధం కానట్లు నటిస్తున్నారో తెలియదు కానీ.. అసలు ఈ రాజినామాలే భవిష్యత్తులో బాబును మామూలుగా ఇబ్బందిపెట్టవు!!

విషయానికొస్తే… ప్రత్యేక హోదా పోరాటం కోసం వైకాపా ఎంపీలు చేసిన రాజినామాలవల్ల ప్రయోజనం లేదనేది బాబు అండ్ కో చెబుతున్న మాట. ఒకవేళ ఈ రాజినామాలు ఆమోదం పొందితే.. అప్పుడు కదా బాబుకు దిమ్మతిరిగేది అనేది విశ్లేషకుల మాట. వైకాపా ఎంపీలు చేసిన రాజీనామాలు ఆమోదం పొంది ఉపఎన్నికలు వస్తే గనుక.. చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డటం ఖాయం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఉపఎన్నికలో అభ్యర్ధిని నిలబెట్టాలా వద్దా అనే విషయం దగ్గరనుంచి బాబు టెన్షన్ మొదలవుతుంది. ఆ ఉపఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ పెడితే.. చంద్రబాబు హోదా వ్యతిరేకి అని ముద్ర పడుతుంది. అలాకాకుండా.. పోటీపెట్టకుండా ఉంటే.. వైకాపా ఎంపీలు గెలిచి మళ్లీ సభకు వెళ్తారు. అదే జరిగితే కనుక వారుచేసిన సాహసం చేయలేకపోయిన అసమర్థుడిగా బాబు మీద ముద్ర పడుతుంది. గెలిచిన వైకాపా ఎంపీలు మళ్లీ పార్లమెంటులో హోదాకోసం నిలబడి ప్రజగళానికి ప్రతీకలుగా నిలబడితే… రాజీనామాలతో లాభం లేదని చెప్పిన బాబు పరువు మొత్తం గంగపాలవుతుంది.

రాజినామాలు డ్రామాలు అని చెప్పుకుని తిరుగుతున బాబు అండ్ కోలకు ఈ విషయం తెలియదని అనుకోవాలా లేక తెలిసే ఏమీ చేయలేని పరిస్థితుల్లో కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుమిట్టాడుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. పైకి డ్రామాలు డ్రామాలు అని చంద్రబాబు చెబుతున్నప్పటికీ… వైకాపా ఎంపీలు చేసిన రాజినామాలు ఎంత బలమైన ఆయుదమో చంద్రబాబుకు తెలుసనేవారే ఎక్కువ. అయితే.. ఆపని తామే చేద్దామంటే ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మరి. ఇప్పుడు చేద్దాం అంటే.. వైకాపా నేతలను అనుసరించలేరు, కొత్త ఆలోచనలు చేయలేరు!! దీంతో… బాబుకు ముందు నుయ్యి వెనక గొయ్యి మిగిల్చింది జగన్ చాకచక్యం.. పోరాట పటిమ!!