Home రాజకీయాలు బాబు బాగోతంపై సాక్షి క్లారిటి!

బాబు బాగోతంపై సాక్షి క్లారిటి!

5627
SHARE

ప్రత్యేక హోదా మీద చంద్రబాబు ఇప్పటివరకూ ఎన్నో మాటలు మాట్లాడారు.. గతంలో హోదా కావాలన్నారు, అనంతరం హోదా జంజీవని కాదు అన్నారు, తాజాగా హోదా అవసరం అంటున్నారు. అయితే బాబు మాటలు ఏ పరిస్థితులకు తగ్గట్టుగా మారాయి, ఎవరి ఒత్తిడి మేరకు నాలు మడతపడింది అనే విషయాలు ప్రజలకు ఎరుకే! ఈ క్రమంలో శనివారం సాక్షి పత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్ మాత్రం చంద్రబాబు బండారం మొత్తాన్ని తేదీలతో సహా ప్రచురించి, పక్కా సమాచారన్ని, అరటిపండు వలిసి నోట్లో పెట్టినట్లు వివరించింది. దీంతో ఆ ఆర్టికల్ చూసిన బాబు అండ్ కోకు ఏసీ లో కూడా ముచ్చెమటలు పడుతున్నాయట. ఇదే క్రమంలో హోదాపై బాబుకి ఉన్నస్పష్టత కూడా ప్రజలకు అర్ధం అవుతుంది!

“ఒక బాబు వంద నాలుకలు” అంటూ సాక్షి ప్రచురించిన కథనంలో బాబును సాక్ష్యాలతో సహా ముప్పుతిప్పలు పెడుతూ, జనాలు మరిచారేమో అనుకున్న మరికొన్ని సంఘటనలు సహా పొందుపరిచారు. ఏప్రిల్‌ 29, 2014న తిరుపతిలో ఎన్డీఏ సభలో “మనకు ప్రత్యేక హోదా కావాలి. ఐదేళ్లే ఇచ్చారు. నేను మోదీగారిని కోరుతున్నా. 15 ఏళ్లు ఇవ్వండి.” అని చంద్రబాబు హోదా మాట మొదలుపెట్టినప్పటి నుంచి.. ఆగస్టు 25, 2015న న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ప్రత్యేక హోదా సంజీవని కాదు..” అని చెప్పిన విషయం నుంచి.. మార్చి 16, 2017న “మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు. ఈ మేరకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నాం.” అని ప్రకటించే వరకూ అన్ని విషయాలను సాక్షి ఈ కథనంలో పొందుపరిచింది.

చిత్రమెమిటంటే… ఈ కథనం చూసిన తర్వాత ఎవరికైనా సరే “బాబు ఇన్ని మాటలు మాట్లాడారా.. జనాలను ఇంతలా మోసం చేశారా.. బాబుకు రాష్ట్రం అన్నా, రాష్ట్రాభివృద్ధి అన్నా ఆటలుగా ఉందా.. రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు అనుభవంతో ఆదుకుంటాడు, సాయపడతాడు అనుకుంటే ఇంత దారుణంగా డ్రామాలాడారా.. ఇంతకాలం ఎవరు చెప్పినట్లు బాబు నడుచుకున్నారు.. తమ తమ అవసరార్ధ మిత్రధర్మం కోసం ఎందుకు రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారు.. తమ రక్షణ కోసం ఎందుకు హోదాని తాకట్టుపెట్టి ప్యాకేజీకి ఒప్పేసుకున్నారు..” వంటి ప్రశ్నలు సామాన్యులకు కలగడం ఖాయం!!