వీరు చేస్తున్న పనులు డ్రామాలు అనేవారికి నోరెలా వస్తుందో తెలియదు కానీ… ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఏపీకి ప్రత్యేకహోదా పోరాటంలో భాగంగా ఎంపీ పదవులకు రాజినామాలు చేసిన వైకాపా నేతలు, అదే క్రమంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ క్రమంలో పోరాటం విషయంలో, ప్రజాక్షేమం విషయంలో వారి వయసు, ఆరోగ్యం సహకరించకపోయినా రంగంలొకి దిగారు వైకాపా నేతలు. వారిలో కొందరు పెద్ద వయసున్న వారు కావడంతో వారి ఆరోగ్యం క్షీణించినా కూడా ఏమాత్రం లెక్కచేయకుండా దీక్ష కొనసాగిస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసి.. ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండోరోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించింది. శుక్రవారమే మేకపాటి అస్వస్థతకు గురైనా కూడా ప్రజలకోసం, ప్రజలకు ఇచ్చిన మాటకోసం తన దీక్ష కొనసాగిస్తూనే వచ్చారు. అయితే శనివారం ఉదయం ఆయనకు తీవ్రమైన తలనొప్పి, హై బీపీ రావడం.. అనంతరం వాంతులు చేసుకోవడంతో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను ఆస్పత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. అయినా ఏమాత్రం లెక్కచేయని మేకపాటి.. దీక్ష కొనసాగిస్తానని చెప్పడంతో బలవంతంగా అంబులెన్స్‌లోకి ఎక్కించిన పోలీసులు.. రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.
ఎంపీల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాజాగా వైద్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఆ పార్టీ ఎంపీలు చేస్తున్న ఈ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘీబావ దీక్షలు కొనసాగుతున్నాయి.