Home రాజకీయాలు బాబు తికమక… చినబాబు మకతిక!!

బాబు తికమక… చినబాబు మకతిక!!

3552
SHARE

ముక్కుసూటిగా మాట్లాడటం మామూలు విషయం కాదు.. అడిగిన ప్రశ్నకు అడిగినట్లు సమాధానం చెప్పడం.. ఆ ప్రశ్నలో తప్పుంటే కడిగినట్లు సమాధానం చెప్పడం అందరికీ రాదు. ప్యూర్ ప్లాన్ తో ఉండే ఏ రాజకీయ నాయకుడైన.. మీడియా అడిగే ప్రశ్నలకు, వైరి పక్షాలు సంధించే ప్రశ్నలకు సూటిగా, సుత్తి లేకుండా సమాధానాలు చెప్పాలి. అలా చెప్పాలంటే.. వారు వీలైనంత హుందాగా ఉండటమే కాదు.. కరెక్టుగా కూడా ఉండాలి.. సమాధానం చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. అయితే… ఈ విషయాల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన పుత్రరత్నం నారా లోకేష్ లు మాత్రం ఎవరు ఏమి ప్రశ్న అడిగినా వారనుకున్న సమాధానాలు చెబుతారు.. ఆ ప్రశ్నకు వారు చెప్పే సమాధానానికి ఏమాత్రం సంబందం లేకపోయినా కూడా!!

మొన్నటికిమొన్న హోదాకోసం ఢిల్లీ వెళ్లిన దుమ్మురేపుతానన్న చంద్రబాబు.. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియా సమావేశంలో జాతీయ మీడియాకు ఎలా చుక్కలు చూపించారో అంతా గమనించారు! ఎవరు ఏ ప్రశ్న అడుగుతున్నారు, దానికి ఏ సమాధానం చెప్పాలి అనే ఆలోచన లేకుండా… సీ, నేను ఏమంటానంటే… అంటూ పొంతనలేని, అర్ధం పర్ధం లేని, ముక్కుసూటితనం లేని, డొంకతిరుగుడు సమాధానాలు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో జర్నలిస్టులంతా జుట్లు పీక్కున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా నారా లోకేష్ కూడా ఏమాత్రం అర్ధం పర్ధం లేని, సమాధానం సూటిగా చెప్పలేని స్పందన తెలియజేశారు.

తమ ఎంపీలు రాజీనామా లేఖల్ని లోక్ సభ స్పీకర్ కు అందజేసిన అనంతరం ట్విట్టర్ లో స్పందించిన జగన్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక సవాలు విసిరారు. తమ ఎంపీల చేత రాజీనామా చేయించిన నేపథ్యంలో.. మీరు కూడా కలిసి వస్తారా? అని సవాల్ విసిరారు. దీనిపై తేలు కుట్టిన పెద్దమనిషిలా చంద్రబాబు మౌనంగా ఉంటే.. చినబాబు లోకేష్ మాత్రం స్పందించారు. స్పందించడం అంటే.. చేస్తాం అనో, మరో కోణంలో పోరాడతాం అనో కాదు సుమా. తనదైన ప్రత్యేక జ్ఞానంతో తనస్థాయిని, తన తెలివితేటలను మరోసారి వివరిస్తూ…. “ఏపీ కోసం జగన్ ఎక్కడా గొంతు ఎత్తలేదు.. కోర్టుల్లో చేతులు కట్టుకోవటం.. శుక్రవారం ప్రార్థనల్లో బిజీగా ఉండటం చేస్తున్నారు” అంటూ స్పందించారు. తాము మాత్రం ఢిల్లీ నుంచి గల్లీ వరకూ పోరాడుతున్నట్లు చెప్పుకొచ్చారు!

జగన్ ట్విట్టర్ లో అడిగిన ప్రశ్నకు, చేసిన సవాల్ కు.. లోకేష్ స్పందించి ఇచ్చిన సమాధానానికి ఏమైనా పొంతన ఉందా? అసలు ఎక్కడైనా లోకేష్ ట్వీట్లో హుందాతనం ఉందా? మంత్రిగా ఉన్న లోకేష్, ముఖ్యమంత్రి తనయుడిగా ఉన్న లోకేష్ స్పందించాల్సిన తీరు ఇదేనా? తన సమాధానంలో వెటకారం, అక్కసు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప మరేమైనా ఉందా? అందుకే లోకేష్ కు ఆ “ముద్దుపేర్లు” వచ్చి పడుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో… బాబు తికమక బ్యాచ్ అయితే.. చినబాబు మరో ఆకు ఎక్కువ చదివిన మకతిక బ్యాచ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి.