Home రాజకీయాలు జూనియర్ మోడీ.. సీనియర్ బాబు!

జూనియర్ మోడీ.. సీనియర్ బాబు!

370
SHARE

తనగురించి తాను చెప్పుకోవడంలో పట్టబధ్రుడు అనే పేరు సంపాదించుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు! ఏమి చేశాం.. ఏమి సాధించాం అనేదానికంటే.. ఎంతకాలం నుంచి ఉన్నాం అన్నదానికి అధికప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించే బాబు… తాజాగా మరోసారి మోడీ గురించి తనదైన “సెల్ఫ్” స్టైల్లో స్పందించారు. రెండోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు, ఆ సమావేశానికి వైకాపా, కాంగ్రెస్, బీజేపీలు హాజరుకాకపోవడంపై గుస్సా అయిన బాబు.. ఈ సందర్భంగా మోడీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు!

తాజాగా మరోమారు ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమవేశంలో సెల్ఫ్ మొదలుపెట్టిన బాబు… మోడీ మాట తప్పారనే విషయాన్ని జాతీయస్థాయిలో వివరించానని చెప్పుకొచ్చారు. దానివల్ల రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనం సంగతి దేవుడెరుగనుకోండి.. అది వేరే విషయం!! అంతేనా… జాతీయ స్థాయిలో బీజేపీ తప్ప అందరూ ఏపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పుకొచ్చారు బాబు! ఢిల్లీ వెళ్లిన బాబు పార్టీ అధినేతలతో మాట్లాడారా.. చోటా మోటా నేతలతో మాట్లాడారా అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో బీజేపీ తప్ప అన్ని పార్టీలు అనడం బాబుకే చెల్లింది! ఆ మాట ఏ ప్రాతిపదికన అన్నారో కూడా బాబుకే తెలియాలి!

అనంతరం మోడీ కంటే తాను ఎంత గొప్ప వ్యక్తినో చెప్పుకునే ప్రత్యనానికి తెరలేపిన బాబు… రాజకీయాల్లో మోడీ తనకంటే జూనియర్ అని చెప్పుకొచ్చారు. మోడీ జూనియర్ అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం సార్ సార్ అని పిలిచానని చెప్పారు బాబు! ప్రధాని పదవిలో ఉన్నారనే ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం తప్ప… ఏ రకంగా చూసుకున్నా మోడీ తనకంటే చిన్న అని చెప్పే ప్రయత్నం చేశారు బాబు!! తనకంటే జూనియర్లు ప్రధానులైపోతుంటే.. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న బాబు మాత్రం ఇంకా రాష్ట్రానికే పరిమితం అయిపోవడం ఎందుకంటే.. బాబు చెప్పే మాట.. రాష్ట్రం కోసరం అని!!

రాష్ట్రం కోసరం, రాష్ట్ర మేలు కోసరం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే కంటే.. దేశ ప్రధానిగా ఉంటే మరిన్ని మేలులు చేయొచ్చనే లాజిక్ బాబు మరవడం వెనక దాగున్న మర్మం పైవాడికే తెలియాలి!! ఇదే క్రమంలో తనకంటే జూనియర్ అయిన వ్యక్తి ప్రధాని అయ్యి బాబు చెబుతున్నట్లు రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే… ప్రధానికంటే సీనియర్ అయిన వ్యక్తి మాత్రం అసమర్ధ ముఖ్యమంత్రిగా మిగిలిపోవడం ఏపీ వాసుల దురదృష్టం అని సరిపెట్టుకోవాలా లేక బాబు చేతకానితనం అని సర్ధుకోవాలా?