Home రాజకీయాలు పవన్‌పై జగన్‌ ఫైర్

పవన్‌పై జగన్‌ ఫైర్

483
SHARE

పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మరోసారి ఫైర్ అయ్యారు. వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్షకు దిగిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్‌ కల్యాణ్‌ ఆమరణ దీక్ష చేస్తానంటే స్వాగతిస్తామన్నారు. కానీ నాలుగేళ్లుగా పవన్‌ కల్యాణ్‌ ఏం చేశారని ప్రశ్నించారు.

ఒక దీక్ష చేశారా? ఒక ధర్నా చేశారా?. ఢిల్లీలో ఏం ఒత్తిడి తెచ్చారని ప్రశ్నించారు. ఆరు నెలలకొసారి వచ్చి ట్వీట్‌ పెట్టడం తప్ప పవన్ కల్యాణ్‌ నాలుగేళ్లుగా ఏమైనా సాధించడం చూశారా అని అని ప్రశ్నించారు. పవన్ రాజకీయంలో సినిమా తక్కువ ఇంటర్వెల్‌ ఎక్కువ అని జగన్ వ్యాఖ్యానించారు.

టీడీపీకి ఓటేయండి అని ఊరురూ తిరిగి ప్రచారం చేసిన పవన్‌ కల్యాణ్ .. నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చి టీడీపీ, బీజేపీ రాష్ట్రాన్ని ముంచాయంటూ ప్రజలకే చెబుతున్నారని జగన్ విమర్శించారు.

టీడీపీ మానిఫెస్టోలో చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్‌ ఫోటో ఉంది నిజం కాదా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నిత్యం ప్రజలను మోసం చేసే బదులు బావిలో దూకితే రాష్ట్రానికిపట్టిన పీడ పోతుందని జగన్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చంద్రబాబు అడ్డుకున్న తీరుపై జగన్‌ ఏడు ప్రశ్నలు సంధించారు. .

గజదొంగ ఒకడు దొంగతనాల నిర్మూలనకు సలహా ఇవ్వండి అంటూ అఖిలపక్షాన్ని పిలిచినట్టుగా చంద్రబాబు తీరుందన్నారు జగన్. అఖిలపక్షాన్ని పిలిచి ఆందోళనలు చేయవద్దు, విద్యార్థులు ఉద్యమంలోకి రాకూడదు, ఉద్యమం పెద్దదైతే రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందంటూ చంద్రబాబు చెప్పారు.

కేవలం నల్లబ్యాడ్జీలు పెట్టుకుని తిరిగితే హోదా వస్తుందా అని చంద్రబాబును ప్రశ్నించారు. అరుణ్‌ జైట్లీ మీ మంత్రులను కూర్చోబెట్టుకుని చంద్రబాబు అంగీకారంలోనే ప్యాకేజ్‌నుప్రకటిస్తున్నామని చెప్పినప్పుడు… అర్థరాత్రి వరకు మేలుకుని అరుణ్ జైట్లీ ప్రకటనను స్వాగతించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి జైట్లీకి శాలువాలు కప్పడం, అసెంబ్లీలో జైట్లీని అభినందిస్తూ తీర్మానం చేయడం నిజం కాదా అని జగన్‌ ప్రశ్నించారు.