Home రాజకీయాలు జగన్ తగ్గడంలేదు… బాబుకు కొత్త టెన్షన్!

జగన్ తగ్గడంలేదు… బాబుకు కొత్త టెన్షన్!

SHARE

నలభై ఏళ్ల యువనాయకుడి సమర్ధత ముందు, ఆ నాయకుడి దూకుడు ముందు, ఆ నాయకుడి పోరాటపటిమ ముందు.. నలబై ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన “రాజకీయ” నాయకుడు చేస్తున్న “రాజకీయం” ఉక్కిరిబిక్కిరి అవుతున్న సందర్భం ఏపీలో చోటుచేసుకుందనే చెప్పుకోవాలి. మాటకు ముందు ఒకసారి మాట తర్వాత ఒకసారి.. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు, వైకాపా అధినేత జగన్ ఊపిరాడకుండా చేస్తున్నారనడంలో సందేహం లేదు. పోరాటం అంటే ఎలాగో చెబుతూ.. ప్రత్యేక హోదా విషయంలో తనదైన దూకుడు, అవిరామ పోరాటం చేస్తున్న జగన్.. తాజాగా చంద్రబాబుకు ఒక సవాల్ విసిరారు!

పార్లమెంటు సమావేశాల అనంతరం జగన్.. తమ ఎంపీలు రాజినామా చేస్తారని ప్రకటించినట్లుగానే.. వైకాపా ఎంపీలు రాజినామాలు చేశారు. అనంతరం.. ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని ప్రకటించినట్లుగానే.. వారంతా ఏపీ భవన్ ముందు దీక్షకు దిగారు. పోరాటం అంటే.. వెనకడుగు వేయడం కాదు, విశ్వసనీయత అంటే మాట తప్పడం కాదు అని నమ్మిన వైకాపా నేతలు.. చెప్పింది చెప్పినట్లు చేస్తూ.. హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి సంఘీభావంగా.. రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ వైకాపా నేతలు, కార్యకర్తలు ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో… వైకాపా ఎంపీల మాదిరిగా టీడీపీ ఏంపీలతో రాజినామాలు చేయించగలరా అని జగన్ సవాల్ విసిరారు.

తాను చెప్పిందే చేశానని.. తమ ఎంపీలతో రాజీనామా లేఖల్ని సమర్పించామని.. మరి.. బాబు కూడా తన ఎంపీలతో ఆ పని చేయించగలరా? అంటూ సవాల్ విసిరారు జగన్. ఈ సవాల్ కు స్పందించే ఆలోచన బాబు చేస్తారని అనుకోలేం. కాకపోతే జగన్ చేసిన ఈ తాజా సవాల్ మాత్రం బాబును ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి. ఈ సవాల్ కు స్పందించాల్సి వస్తే.. వైకాపా నాయకులపై విమర్శలు చేయడం, జగన్ కు బీజేపీకి ముడేట్టి గొంతులు చించుకోవడం మినహా… ఈ సవాల్ ను స్వీకరించే ఆలోచన చేయరనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ఒకవేళ టీడీపీ నేతలు జగన్ మాట విని.. రాజినామాలు చేస్తే మాత్రం అది కచ్చితంగా జగన్ క్రెడిట్ అవుతుందనడంలో సందేహం లేదు!!

ఏది ఏమైనా.. ప్రత్యేక హోదా పోరాటం విషయంలో తన దూకుడు కొనసాగిస్తూనే బాబును ఇరుకున పెడుతూ ముచ్చెమటలు పట్టించే కార్యక్రమాలకు తెరలేపుతు వైకాపా అధినేత జగన్. అయితే జగన్ చేసిన ఈ సవాల్ మరోసారి రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది!