Home సినిమా భరత్‌ టీమ్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌

భరత్‌ టీమ్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌

117
SHARE

ఈ ఉదయం నుంచి సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం సర్‌ ప్రైజ్‌ అంటూ ఊరిస్తూ వస్తున్న మేకర్లు కాసేపటి క్రితం ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో ఈ చిత్ర ఆడియో వేడుకకు జూనియర్‌ ఎన్టీఆర్‌ చీఫ్‌ గెస్ట్‌గా రాబోతున్నాడన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు.

‘భరత్‌ బహిరంగ సభకు ప్రేమతో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌’ అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. శనివారం ఈ చిత్ర ఆడియో వేడుకను ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. కాగా, సాధారణంగా తన సినిమాలకు చీఫ్‌ గెస్ట్‌లంటూ ప్రాధాన్యం ఇవ్వని మహేష్‌ ఫస్ట్‌ టైమ్‌ ఎన్టీఆర్‌తో స్టేజీని షేర్‌ చేసుకోబోతుండటం విశేషం. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన భరత్‌ అనే నేనుకు దేవీశ్రీప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చాడు.