Home రాజకీయాలు పక్కోడి భార్యపై నామా కన్ను. పోలీసులను ఆశ్రయించిన భర్త

పక్కోడి భార్యపై నామా కన్ను. పోలీసులను ఆశ్రయించిన భర్త

SHARE

టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావుపై ఒక భర్త జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భార్యను తన నుంచి విడదీసి .. సొంతం చేసుకునేందుకు నామా నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారంటూ రామకృష్ణన్‌ అనే ఎన్‌ఆర్‌ఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోనామా నాగేశ్వరరావుతో పాటు ఆయన సోదరుడు నామా సీతమ్మపై క్రిమినల్‌ కేసు నమోదైంది.

హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణన్‌ దంపతులు చాలాకాలంగా అమెరికాలో ఉంటున్నారు. అయితే భార్య సుజాత 2014లో హైదరాబాద్‌ వచ్చి ఉంటున్నారు. భర్త అమెరికాలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు నామానాగేశ్వరరావుతో పరిచయం ఏర్పాడింది. అది హద్దులు దాటి వేధింపుల వరకు వెళ్లింది. గత ఏడాది చివర్లో ఆమె నామా సోదరులు వేధిస్తున్నారంటూ పోలీసులకుఫిర్యాదు చేశారు.

ఇప్పుడు ఆమె భర్త అమెరికా నుంచి వచ్చి నామా సోదరులపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఆసక్తికరమైన అంశాలు వివరించారు. రెండు రోజుల క్రితం తాను హైదరాబాద్‌ వచ్చి తన భార్యను ఆరా తీయగా… నామా నాగేశ్వరరావుతో 2013 నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్టు వివరించిందని ఫిర్యాదుతో తెలిపారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా విడాకులిచ్చి తనతోపాటు ఉండాల్సిందిగా నామా వేధిస్తున్నారని రామకృష్ణన్‌ ఫిర్యాదులో వివరించారు. తన భార్యను నామా సోదరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రామకృష్ణన్ ఫిర్యాదులో వివరించారు. దీంతో నామా నాగేశ్వరరావుతో పాటు.. అతడి సోదరుడు నామా సీతయ్యపై పోలీసులు ఐపీసీ 497, 504, 506 కింద కేసులు నమోదు చేశారు.