Home సినిమా కొత్త లుక్‌ కోసం తారక్‌…

కొత్త లుక్‌ కోసం తారక్‌…

SHARE

ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లుక్‌ లో కనిపించేందుకు చాలా రోజులుగా జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కసరత్తులకు సంబంధించిన వీడియోలు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన ఫొటో సామాజిక్‌ మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది.

ఈ సినిమాలో కోసం హాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో ఎన్టీఆర్‌ కసరత్తులు చేస్తున్న ఫొటోను అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. పర్ఫెక్ట్ లుక్‌ కోసం ఎంతో నొప్పిను బరిస్తూ ఎన్టీఆర్‌ కష్టపడుతున్నాడు. ఈ ఫొటో చూసిన జూనియర్‌ అభిమానులు గర్వంగా ఫీల్‌ అవుతున్నారు. థ్రిల్లర్‌ జానర్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే, అను ఇమ్మాన్యూల్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.