Home సినిమా సమంత సొంత వాయిస్‌

సమంత సొంత వాయిస్‌

SHARE

‘మహానటి’, సావిత్రి నిజ జీవితం ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సావిత్రిగా కీర్తి సురేశ్‌ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ సమంత కీలక పాత్ర పోషించారు.

సమంత ఈ సినిమాతో అభిమానులకు తన గొంతును వినిపించబోతున్నారు. తెలుగులో మొదటిసారిగా ఈ సినిమాకు డబ్బింగ్‌ చెబుతున్నారు. సమంత వాయిస్‌ అంటే అందరికీ గుర్తొచ్చేది చిన్మయి శ్రీపాదే. సమంతకు అంతగా ఆ వాయిస్‌ సెట్‌ అయింది.

మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంస్థలుసంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు, మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.