Home రాజకీయాలు ఫక్తూ రాజకీయ యాత్ర.. సాక్ష్యాలివిగో!

ఫక్తూ రాజకీయ యాత్ర.. సాక్ష్యాలివిగో!

SHARE

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 30వసారి ఢిల్లీ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా పోరాటం కోసం హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు… వస్తూ వస్తూ హోదాపై క్లారిటీ తీసుకుని వస్తారని అంతా భావించారు! ఈ మేరకు తమ పార్టీ కరపత్రాలు ఢిల్లీపై ఏపీ మొనగాడి యుద్ధం అనే స్థాయిలో పతాక శీరిషికన కథనాలు రాసుకొచ్చాయి. బాబు ఢిల్లీ వెళ్లి తన రాజకీయ అనుభవాన్ని మొత్తం ఉపయోగించేసి, గతంలో జాతీయ స్థాయిలో రాజకీయాల్లో తిప్పిన చక్రం మరోసారి తిప్పేసి తద్వారా హోదా తెస్తారని చెప్పుకొచ్చారు. బాబు ఢిల్లీ వేళ్లారు.. ఉన్నారు.. వచ్చారు.. ఒరిగిందేమిటి? అసలు బాబు యాత్ర హోదా కోసం కాదు.. ఇది టీడీపీ వర్గాలకూ తెలుసు! ఇది ఫక్తూ రాజకీయ యాత్ర అని అనుకోవడానికి కావాల్సినన్ని సాక్ష్యాలను బాబు వదిలి వెళ్లారు!!

ప్రత్యేక హోదా పోరాటం కోసం ఢిల్లీకి వెళ్లిన బాబు సాధించిందేమిటి అంటే… నాలుగు ఫోటోలు, రెండు రోజులు మీడియాకు ఫుల్ మీల్స్!! బాబు హస్తినకు చేరుకున్నప్పటినుంచీ జరిగిన వ్యవహారమంతా… పాత మిత్రుల పలకరింపులానే సాగింది. చాలా కాలం తర్వాత సిటీ నుంచి ఊరికి వెళ్తే… స్నేహితులు, బందువులు ఎలా పలకరిస్తారు… “ఏవండీ.. ఎలా ఉన్నారు.. ఎప్పుడొచ్చారు.. అంతా బాగున్నారా.. జాబ్ బాగుందా..” ఇదే పలకరింపులు బాబు ఢిల్లీలో చేశారు తప్ప మరొకటి కాదనేది సుస్పష్టం!! ఎందుకంటే… బాబు కలిసిన చోటా మోటా నేతల్లో ఏ ఒక్కరైనా “ఏపీకి ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతిస్తున్నాం” అని చెబితే.. బాబు ఆ విషయాన్ని మామూలుగా హైలైట్ చేసేవారు కాదు.

ఈ సందర్భంగా ఈ యాత్రలో బాబు అత్యంత సీక్రెట్ గా ఉంచిన విషయాల్లో సోనియాగాంధీకి అత్యంత విధేయుడైన అహ్మద్ పటేల్ తో కలిసి రహస్యంగా జరిపిన చర్చలు. అహ్మద్ పటేల్ ని కలిస్తే.. దాదాపు సోనియాతో చర్చలు జరిపినట్లే భావిస్తుంటాయి ఢిల్లీ వర్గాల్లో. దీంతో గతంలో బీజేపీ ని నోటికొచ్చినట్లు తిట్టి, బీజేపీతో స్నేహం తాను చేసిన చారిత్రక తప్పిదం అన్న అనంతరం.. 2014లో చేతులుపట్టుకుని పైకెత్తిన బాబు సంగతి అంతా చూశారు. ఇదే క్రమంలో ఏ కాంగ్రెస్ పాలనకు, ఏ కాంగ్రెస్ పాటీకి వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మాభిమానం నుంచి పుట్టింది అని చెప్పుకునే టీడీపీ త్వరలో కాంగ్రెస్ గూటికి చేరబోతుందనే విశ్లేషణలు జాతీయస్థాయిలో మొదలైపోయాయి.

విచిత్రం ఏమిటంటే… ఇక్కడ బాబుకు – అహ్మద్ పటేల్ కు జరిగిన డిషషన్ గురించి టీడీపీ నేతలకు కూడా తెలియకపోవడం. ఆఫ్ లైన్ లో టీడీపీ నేతలతో మాట్లాడిన మీడియా కు .. మాకు మాత్రం ఏమి తెలుసు సర్ అనే సమాధానం రావడం కొసమెరుపు.

అయితే… ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. ఢిల్లీ బయలుదేరేవరకూ ఈ 30వ యాత్ర పూర్తిగా ప్రత్యేక హోదా గురించేనని, రాష్ట్ర ప్రయోజనాలకోసమేనని, రాజకీయాలకు తావులేదని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. అక్కడ బాబు ప్రస్థావించిన విషయాలన్నీ రాజకీయకోణంలోనూ, తన రక్షణ కోణంలోనూ జరిగాయని అంటున్నారు!! బాబుకు కచ్చితంగా జాతీయస్థాయిలో రక్షణ అవసరం.. ఈ విషయంలో కాంగ్రెస్సా, బీజేపీనా వంటి తేడాలేమీ బాబుకు లేవనే చెప్పాలి. కారణం… లోకానికెరుకే!!