Home సినిమా ‘చల్ మోహన్ రంగ’ రివ్యూ

‘చల్ మోహన్ రంగ’ రివ్యూ

SHARE

రివ్యూ: చల్ మోహన్ రంగ
రేటింగ్‌:  3/5
తారాగణం: నితిన్, మేఘా ఆకాష్, నరేష్, రావు రమేష్, లిజి, ప్రగతి తదితరులు
సంగీతం:  ఎస్. థమన్
నిర్మాత:    త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డి
దర్శకత్వం: కృష్ణ చైతన్య

టాలీవుడ్‌లో విజయాలు, అపజయాలు అనేవి పట్టించుకోకుండా యువహీరో నితిన్ దూసుకెళ్తున్నారు. గత 16 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చవి చూసిన ఆయన నటించిన చిత్రాలు కొన్ని ఘనవిజయాలు, కొన్ని నిరాశపరిచాయి. ఛల్ మోహన రంగ చిత్రం నితిన్‌కు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నితిన్‌కు 25 వ చిత్రం కావడం, అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించడం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను అందించడం సినిమా స్పెషల్‌గా మారింది. లై చిత్రం  తర్వాత నితిన్, మేఘా ఆకాశ్‌ల హీరో,  హీరోయిన్ లుగా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నితిన్, మేఘా ఆకాశ్‌లకు ఎలాంటి సక్సెస్‌ను అందించింది?

కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినప్పుడు దాన్ని వెనక్కు తెచ్చుకునే మార్గాలు చూస్తారే తప్ప ఇది ఎంత వినూత్నంగా ఉంది అనే దాని మీద దృష్టి పెట్టడం ప్రతి సారి సాధ్యపడకపోవచ్చు. మనకున్న జానర్లు అతి తక్కువ. ప్రేమ, హింస, హారర్, లవ్, రొమాన్స్, కామెడీ ఇలా ఏదో ఒక క్యాటగిరీకి కట్టుబడే సినిమాలు తీయాలి తప్పించి ఏదో ప్రయోగం చేసి ప్రేక్షకులను మెప్పించాలనే తపన అందరిలో ఉండదు. ఇది వ్యాపార కోణం కాబట్టి దాన్ని తప్పు బట్టడానికి కూడా లేదు. అలాగే చల్ మోహన్ రంగ కూడా రిస్క్ లేకుండా తీసిన లవ్ అనే రెగ్యులర్ జానర్ లో వచ్చిన మూవీ కాబట్టి…

కథ :

చిన్నతనంలో తనకు పరిచయం అయిన అమ్మాయి అమెరికా వెళ్లిందని తెలుసుకొని ఎలాగైన అమెరికా వెళ్లాలని ఆ వయసులోనే నిర్ణయించుకుంటాడు హీరో. హీరో హీరొయిన్ అమెరికాలో కలుసుకుని ఫ్రెండ్స్ అవుతారు. కాని ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసుకోవడంలో ఫెయిల్ కావడంతో విడిపోతారు. హీరోయిన్ ఊటి వచ్చేస్తుంది. హీరో కూడా వైరాగ్యం తట్టుకోలేక అక్కడికే వస్తాడు. అప్పటికే హీరొయిన్ పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు తనని హీరో ఎలా సొంతం చేసుకుంటాడు అనేది చల్ మోహన్ రంగ.. సింపుల్ గా ఇది కథ…

నటీనటులు :

నితిన్ నటన.. సినిమా సినిమాకు నటుడిగా ఎదుగుతున్న నితిన్‌ ఈ సినిమాలో మరింత పరిణతి కనబరిచాడు. ఎమోషనల్‌ సీన్స్‌ తో పాటు అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రేమకు దూరమైన యువకుడిగా బాధను చూపిస్తూనే కామెడీతో అలరించాడు.. లవర్ బాయ్ గా స్నేహితులతో సరదాగా ఉంటూ నచ్చిన అమ్మాయిని సొంతం చేసుకోవాలని తపన పడే సగటు యూత్ హీరోగా నితిన్ కనిపిస్తాడు.

మేఘా ఆకాష్ మొదటి సినిమా లై కన్నా ఇందులో బెటర్ గా హీరోయిన్ లిజి ఇందులో మేఘా తల్లిగా రీ ఎంట్రీ ఇవ్వడం కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. హీరో తండ్రిగా నరేష్, తల్లిగా ప్రగతి, హీరోయిన్‌ తండ్రిగా సంజయ్ స్వరూప్‌లు రొటీన్‌ పాత్రలో కనిపించారు. ఇతర పాత్రల్లో నర్రా శ్రీను, మదునందన్‌, శ్రీనివాస్‌, ప్రభాస్‌ శ్రీను, సత్యలు కామెడీ తో ఆకట్టుకున్నారు… మిగిలినవాళ్ళు ఓకే.

విశ్లేషణ :

రౌడీఫెలో సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ చైతన్య… ఛల్‌ మోహన్‌ రంగతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అందించిన రొటీన్‌ కథను తనదైన కథనంతో ఆసక్తికరంగా చూపించాడు. ముఖ్యంగా గేయ రచయిత అయిన కృష్ణచైతన్య డైలాగ్స్ తో సినిమా రేంజ్‌ ను పెంచాడు. ‘నీలా ఉండడం నాకు ఆనందం. కానీ, నాలా ఉండడం నాకు అవసరం’.. కృష్ణ చైతన్య సంభాషణల్లో చాలా సార్లు త్రివిక్రమ్‌ కనిపిస్తాడు. ముఖ్యంగా ప్రాసలు, పంచ్‌ల విషయంలో త్రివిక్రమ్‌నే ఫాలో అయినట్టుగా అనిపిస్తుంది.

తమన్ అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం బాగుంది. నటరాజన్ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. న్యూయార్క్‌ సిటీని కలర్‌ఫుల్‌ గా చూపించిన సినిమాటోగ్రాఫర్‌ ఊటి అందాలను అంతే అ‍ద్భుతంగా చూపించారు. ఎటిడింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

చల్ మోహన్ రంగా ఒక సాఫ్ట్ అండ్ కూల్ కామెడీ ఎంటర్ టైనర్. మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు నచ్చడం ఖాయం. అదే విధంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే సినిమా సూపర్ హిట్‌గా మారే అవకాశం ఉంది.