Home సినిమా సామీ వచ్చాడు..

సామీ వచ్చాడు..

SHARE

టాలీవుడ్‌ మోస్ట్‌ అవెయిటెడ్‌ మూవీ ‘భరత్‌ అనే నేను’ చిత్రం నుంచి మూడో సాంగ్‌ వచ్చేసింది. ‘వచ్చాడయ్యో సామీ.. నింగి సుక్కల్తో గోడుగెత్తింది భూమి.. ఇచ్చాడయో సామీ కొత్త రెక్కల్ని మొలకెత్తించే హమీ’ అంటూ సాగే సాంగ్‌ను కాసేపటి క్రితం విడుదల చేశారు.

పంచెకట్టులో ముఖ్యమంత్రి భరత్‌ ప్రజలతో కలిసి చిందులేసే నేపథ్యంలో స్టిల్స్‌ను కూడా వదిలగా.. అభిమానులు పండగలా ఫీలవుతున్నారు. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం.. దానికి కైలాష్‌కేర్‌, దివ్య కుమార్‌లు అందించిన గాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. యాజ్‌ యూజ్‌వల్‌గా దేవి తనదైన బీట్‌ను అందించేశాడు.

కొరటాల శివ, పొలిటికల్‌ కమర్షియల్‌ డ్రామాగా  భరత్‌ అనే నేనును తెరకెక్కించాడు. కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఏప్రిల్‌ 7న చిత్ర ఆడియోను భరత్‌ బహిరంగ సభ పేరిట విడుదల చేయనున్నారు, ఏప్రిల్‌ 20న భరత్‌ అనే నేను ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.