Home రాజకీయాలు ఎల్లో ప్రచారం… ఫోటోల ఉత్సాహం!

ఎల్లో ప్రచారం… ఫోటోల ఉత్సాహం!

872
SHARE

దేశ రాజధాని ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటనపై బీజేపీ తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. టీడీపీ పరపతి పూర్తిగా క్షీణించినట్లు తన ఢిల్లీ పర్యటన ద్వారా చంద్రబాబే బహిర్గతం చేసుకున్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ కు ఎల్లో మీడియా సమాధానాలు తనదైన శైలిలో చెప్పుకొచ్చింది. బాబుపై వచ్చే విమర్శలకు బాబుకంటే ముందే స్పందించే ఎల్లో మీడియా… బీజేపీ నేతల కామెంట్స్ కి సమాధానాలు అన్నట్లు “ఫోటోల ఉత్సాహం” ప్రచురించింది. ఆ కామెడీ కౌంటర్ సంగతి ఇప్పుడు చూద్దాం!

ప్రస్తుతం బాబు పద్దతి, ప్రవర్తన, ఢిల్లీలో పరిస్థితులు చూస్తుంటే… బాబు 30వ యాత్ర వల్ల కలిగే ప్రయోజనాలు శూన్యం అని, దానికి కారణం బాబులో లోపించిన చిత్తశుద్దే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకునే 40ఏళ్ల అనుభవజ్ఞుడి అనుభవం బూడిదలో పోసిన పనీరు కాక మరేమిటనే వ్యాఖ్యానాలు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతకాలం సైడ్ అయిపోయిన బాబు యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా వచ్చినా రాకున్నా… ఆ హోదా పోరాటం క్రెడిట్ మాత్రం తనకే రావాలని తెగ తాపత్రయపడిపోతున్నట్లు కనిపిస్తుంది!! ఇందులో భాగంగా… ఫలితం సంగతి పక్కనపెట్టి, ఫోటోలతో రాజకీయం మొదలుపెట్టారు బాబు. గాంధీ విగ్రహం, పార్లమెంటు మెట్ల నుంచి మొదలైన ఈ హాస్య రాజకీయం… “యువ ఎంపీలు బాబుతో ఫోటోలకోసం ఎగబడుతున్నారు” అనేవరకూ వచ్చింది.

సెంట్రల్‌హాల్‌లో చంద్రబాబుతో మాట్లాడటానికి, ఫొటోలు దిగడానికి యువ ఎంపీలు ఉత్సాహం చూపారు.. చాలామంది తమంత తాముగా వచ్చి చంద్రబాబుతో సెల్ఫీలు తీసుకున్నారు” అంటూ ఎల్లోమీడియా కథనాలు రాసుకొచ్చింది. బాబు ఢిల్లీ ఎందుకు వెళ్లారు, ఢిల్లీ యాత్ర అనంతరం బాబు.. ఏపీ జనాలకు చెప్పాల్సింది ఏమిటి.. సాదించింది ఏమిటి.. అనే విషయాలు పక్కనపెట్టిన పసుపు కరపత్రాలు… ఈ ఫోటోల రాజకీయానికి తెరలేపాయి. ఢిల్లీలో చంద్రబాబు పరపతి ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి.. వారు ఎంచుకున్న మార్గం “బాబుతో యువ ఎంపీల ఫోటోలు”!

ఇదే క్రమంలో బాబు కలిసిన మిగిలిన చోటా మోటా నేతలందరిలోనూ… బాబు చెప్పిన మాటలకు.. “అవును ఏపీకి అన్యాయం జరిగింది.. రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు.. కేవలం ప్రధానమంత్రి వైఖరివల్ల భాగస్వామ్యపక్షాలకు సమస్యలు వస్తున్నాయని, వాళ్లు ఎందుకిలా చేసుకుంటున్నారో అర్థంకావడంలేదు.. పార్లమెంటుకు, అందులో చేసిన చట్టాలకు, ఇచ్చిన హామీలకు గౌరవం ఇవ్వాలి..” వంటి మాటలు మిగిలాయి తప్ప.. ఏపీలో బయలుదేరే ముందు పలికి ప్రగల్భాలకు, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలకు పొంతనలేకుండా పోయిందనే అనుకోవాలి!