Home రాజకీయాలు బాబు మోసం… జగన్ చెంతకు నిరుద్యోగ లోకం!!

బాబు మోసం… జగన్ చెంతకు నిరుద్యోగ లోకం!!

SHARE

చదువులేకపోతే ఏ కూలో నాలో చేసుకుని బ్రతకవచ్చు కానీ… బాగా చదువుకుని ఏ ఉద్యోగం దొరకకపోతే మాత్రం వారి పరిస్థితి మామూలుగా ఉండదు అనేది గ్రామాల్లో ఎక్కువగా వినిపించే మాట! ఇలా చదువుకుని ఉద్యోగం దొరక్క, ప్రభుత్వ శాఖల్లో లక్షల ఖాళీలు ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోక.. ఆ నిరుద్యోగ యువత భరిస్తున్న వేదన, అనుభవిస్తున్న నరకం మాముల్ది కాదు. ఈ పరిస్థితిని అడ్డుపెట్టుకునే 2014 ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ప్రకటించింది టీడీపీ. అయితే ఈ వాగ్ధానం నిజం అని నమ్మిన యువత.. బాబును గద్దెనెక్కించారు! అనంతరం జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే… యువతను బాబు నిర్లక్ష్యం చేశారు. చేసిన వాగ్ధానాన్ని మూలన పడేశారు.. యువత కళ్లల్లో నీళ్లు తెప్పించారు.. వాళ్ల కుటుంబాల్లో ఆవేదన మిగిల్చారు.

ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించి ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో విడుదలచేయలేకపోయింది. అలా అని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు లేవేమో అని అనుకుంటే పొరబడినట్లే… ఎందుకంటే సుమారు లక్షన్నర పోస్టులు ఖాళీగా ఉన్నాయంట! నిరుధ్యోగ భృతికి రాష్ట్ర బడ్జేట్ లోటు అంటున్న బాబు.. దాదాపు రెండు లక్షలకు మాత్రం బడ్జెట్ ప్రవేశపెట్టిస్తారు. పక్కనున్న తెలంగాణకంటే ఒక్కరూపాయి అయిన ఎక్కువ పెట్టాలనే తాపత్రయమే తప్ప… పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే సామెత జనాలకు తెలుసుకదా అనే ఆలోచన ఏమాత్రం లేదనేది తెలిసిన విషయమే! ఈ క్రమంలో గుంటూరు నగరంలో పాదయాత్ర చేపట్టిన వైఎస్‌ జగన్‌ ను కలిసింది ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ ఐక్య వేదిక! బాబు చేసిన మోసాలు, చేస్తున్న అన్యాయాలను జగన్ వద్ద చెప్పుకుని ఆవేదన చెందారు నిరుద్యోగ యువత.

ఈ సందర్భంగా… ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 సర్వీసులను ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌–1లో విలీనం చేయకుండా గతంలో మాదిరిగానే శాశ్వతంగా గ్రూప్‌–2 సర్వీసులోనే ఉంచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని.. పంచాయతీ కార్యదర్శి పోస్టులను శాశ్వత రీతిలో ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేసే విధంగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని.. వీఆర్వో పోస్టులకు ఐటీఐ చదివి ఉండాలనే నిబంధనలు సడలించి, గతంలో మాదిరిగా ఇంటర్మీడియెట్‌ విద్యార్హతనే కొనసాగించాలని కోరారు. నిరుద్యోగ యువత అభ్యర్ధనలను విని ఆవేదన చెందిన జగన్… వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి, తమ ప్రభుత్వంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

దీంతో… ఆ కార్యక్రమం అనంతరం స్పందించిన యువత… నిరుద్యోగుల బలహీనతను బాబు అర్ధం చేసుకున్నారని తాము గత ఎన్నికల్లో నమ్మామని.. కానీ బాబు అర్ధం చేసుకోలేదు సరికదా, దాన్ని అడ్డుపెట్టుకుని అధికారం చేజెక్కించుకున్నారని, అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పడం గమనార్హం!!