Home రాజకీయాలు పర్యటన విజయవంతం అయి”పోయిందంట”!

పర్యటన విజయవంతం అయి”పోయిందంట”!

1060
SHARE

రంగంలోకి దిగగానే రజతం.. వేడి పుట్టగానే వెండి.. గొళ్లుమనగానే గోల్డు పథకం వచ్చింది అన్నాడట వెనకడికి ఒక పెద్దమనిషి! అలా ఉంది టీడీపీ నేతల మాట తీరు! గతనాలుగేళ్లుగా మిన్నకుండి, తమ వ్యక్తిగత రాజకీయ స్వార్ధ ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసిన టీడీపీ ప్రభుత్వం.. హోదాని సైతం “ప్యాకేజీ”కోసం తాకట్టు పెట్టినవైనం అంతా చూశారు! అయితే తాజాగా గత కొన్ని రోజులుగా ప్రత్యేక హోదా ఏపీవాసుల హక్కు అంటూ జగన్ నినాదానికి వంతపాడి లైన్ లోకి వచ్చినట్లు కనిపించిన టీడీపీ.. పోరాటంలో నిజాయితీని కనబరచకుండా.. క్రెడిట్ కోసం తెగ తాపత్రయపడుతుంది. ఇందులో భాగంగా చేతులు కాలాక ఢిల్లీకి బయలుదేరారు చంద్రబాబు. అలా బయలుదేరి వెళ్లారో లేదో పర్యటన విజయవంతం అయిపోయిందని ప్రకటించేస్తున్నారు!

ఏపీకి ప్రత్యేక హోదా కోసం “దేశం” కదిలింది అంటూ ప్రచారాలు చేసుకుంటున్న తమ్ముళ్లు.. ఇప్పటికే సగం పని అయిపోయింది ఇంక మోడీ ప్రత్యేక హోదా ప్రకటించడమే ఆలస్యం అన్న రేంజ్ లో కబుర్లు చెబుతున్నారు, కరపత్రాలు ప్రచురిస్తున్నారు!! ఇంక రెండే రోజులు పార్లమెంటు సమావేశాలు ఉండగా ఇప్పటికి కళ్లుతెరిచిన చంద్రబాబు… తగుదునమ్మా అంటూ హస్తినకు బయలుదేరారు.. ఫోటోషూట్స్ అయిన అనంతరం కొంతమంది నేతలను కలిశారు.. ఆ విషయంపై ప్రజలకు ఇప్పటికీ క్లారిటీగా చెప్పింది లేదు! అయినా సరే.. పర్యటన విజయవంతం అయిపోయిందని ప్రకటించేస్తున్నారు టీడీపీ నేతలు!

తాజాగా చంద్రబాబు ఢిల్లీ యాత్ర @ 30 పై స్పందించిన రామ్మోహన్ నాయుడు… సీఎం చంద్రబాబు పార్లమెంటు పర్యటన విజయవంతమైందని .. సెంట్రల్‌ హాల్‌లో వివిధ పార్టీల ముఖ్యనేతలను కలుసుకొని రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారని.. కేంద్రంపై మరింత ఒత్తిడి తేవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు రంగంలోకి దిగారని, మంచి స్పందన లభించిందని చెప్పుకొచ్చారు. ఇందులో… రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించడం, కేంద్రంపై ఒత్తిడి తేవాలని పలువురు నేతలను కోరడ వరకూ బాగానే ఉంది కానీ… మరీ దారుణంగా అప్పుడే “పర్యటన విజయవంతం అయ్యింది” అని ప్రకటించడం చాలా ఎబ్బెట్టుగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే బాబు పర్యటన విజయవంతం అయినట్లు.. అలాంటి ప్రకటన ఏమీ కేంద్రం నుంచి రాకుండానే.. పర్యటన విజయవంతం అయిపోయిందని చెప్పడం హాస్యస్పదమే కాకుండా పలు అనుమానాలకు తావిస్తుంది. జగన్ చెప్పినట్లుగా “తనపై విచారణ వస్తే.. అంతా సహకరించాలని మిగిలిన పార్టీలను రిక్వస్ట్ చేసుకోవడానికి బాబు ఢిల్లీ వెళ్లారా” అనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు జనాలు. అలా ఏదైనా వారనుకున్న కోణంలో పర్యటన విజయవంతం అయ్యిందేమో కానీ.. ఏపీ వాసులకు కాదని తేల్చేస్తున్నారు!!