Home రాజకీయాలు బాబును ఓడించిన జగన్‌-డీసీ కథనం

బాబును ఓడించిన జగన్‌-డీసీ కథనం

1783
SHARE

సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ- వైసీపీ అభిమానుల మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది. కాబోయే సీఎం ఎవరు అంటూ ఆన్‌లైన్‌ పోల్‌ కూడా తరచూ నిర్వహిస్తున్నారు. ఈసారి ఇలాంటి పోల్‌ను టీడీపీ అభిమానుల ఫేస్‌బుక్‌ ఖాతాలో నిర్వహించారు. కానీ ఫలితం తేడాగా ఉండడంతో వెంటనే ఈ పోల్‌ను తొలగించించారు. ఈ అంశంపై ఆంగ్ల దిన పత్రిక డెక్కన్ క్రానికల్ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది.

టీడీపీ సానుభూతిపరులే అత్యధికంగా ఉండే సదరు ఎఫ్‌బీ ఫేజ్‌లో.. హు ఈజీ నెక్ట్స్‌ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ అంటూ పోల్‌ పెట్టారు. పోల్‌ మొదలైన తర్వాత టీడీపీ పేజ్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా నెటిజన్లు ఓటేశారు. టీడీపీ పేజ్‌ అయినప్పటికీ అత్యధిక ఓట్లు వైఎస్ జగన్‌కు రావడంతో టీడీపీ పేజ్ నిర్వాహకులు కంగుతిన్నారని పత్రిక చెబుతోంది.

జగన్‌కు అనుకూలంగా 51 శాతం, చంద్రబాబుకు అనుకూలంగా 49 శాతం ఓట్లు వచ్చాయి. నిజానికి టీడీపీ పేజ్‌ కాబట్టి చంద్రబాబుకు అనుకూలంగా భారీగా ఓట్లు రావాలి. కానీ అది జరగలేదు. దీంతో పోల్‌ ముగియడానికి ఇంకా చాలా సమయం ఉండగానే దాన్ని తొలగించేశారని ఆంగ్ల పత్రిక వివరించింది.

టీడీపీ పేజ్‌లో జగన్‌కు అత్యధిక ఓట్లు రావడంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అభిప్రాయం కోరగా.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పోల్‌లో తేడా ఉందని.. సరిగా నిర్వహిస్తే టీడీపీకి 80 శాతం ఓట్లు వస్తాయని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబుపై ప్రజల్లో అభిప్రాయం మారిపోతోందనడానికి ఇలాంటి పోల్‌లు అద్దంపడుతుంటాయని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబును అవుట్ డేటెడ్‌ వ్యక్తిగా ప్రజలు భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తెలుగు ప్రజల హక్కులను కాపాడడంలో విఫలమయ్యారన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని అందుకే టీడీపీ పేజ్‌లో కూడా ఆయనకు అనుకూలంగా ఓటింగ్‌ లేదని వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు.