Home రాజకీయాలు ఢిల్లీలో బాబు మార్కు కామెడీ!!

ఢిల్లీలో బాబు మార్కు కామెడీ!!

SHARE

30వసారి ఢిల్లీకి పయనం అంటూ హస్తినకు బయలుదేరిన బాబు.. పార్లమెంటు ఆవరణకు చేరుకున్నప్పటి నుంచి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో పెద్దలను కలిసే వరకూ మామూలు హాస్యం చేయలేదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సెటైర్ల వర్షాలు కురిపిస్తున్నారు. పార్లమెంటు కు చేరుకోగానే.. మహాత్ముడి విగ్రహానికి నమస్కరించడం దగ్గరనుంచి, పార్లమెంటు మెట్లకు మొక్కడం దగ్గర నుంచి పార్లమెంట్ హాల్ లో బాబు మామూలు హాస్యం చేయలేదట! ఈ క్రమంలో ఒకరిద్దరు నేతలతో ఫుల్ గా పంచులు వేయించుకున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో.. గాంధీ విగ్రహం, పార్లమెంటు మెట్ల వద్ద చేసిన విన్యాసాల అనంతరం… పార్లమెంటు సెంట్రల్ హాల్లో పలువురు నేతలతో మాటలు కలిపారట బాబు! ఈ విషయంలో కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తోనూ మాట్లాడినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా వీరిద్ధరి మధ్య జరిగిన మాటల్లో జైరాం వేసిన పంచ్ కు బాబుకు దిమ్మతిరిగి బొమ్మ కనపడిందని టాక్ నడుస్తుంది!!

పార్లమెంటు సెంట్రల్ హాల్లో తనకు ఎదురుపడిన జైరాంతో మాట్లాడిన చంద్రబాబు.. ఏమాత్రం వెనకా ముందు ఆలోచించకుండా.. “రాష్ట్రాన్ని మీరే విభజించారు” అని అనగా.. దానికి తనదైన ఘాటు కౌంటర్ ఇచ్చిన జైరాం రమేష్… “మీరు రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చారు.. ఆ తర్వాతే విభజన జరిగింది” అని అన్నారంట. ఈ మాటకు కంగుతిన్న బాబు తర్వాత కలుద్దామని జైరాంకు బై చెప్పి సైలంటుగా సైడైపోయారని చెబుతున్నారు.

ఈ మచ్చుకు ఒకటి మాత్రమే… పార్లమెంటు సెంట్రల్ హాల్లో బాబు చేస్తున్న హడావిడి, ప్రవర్తిస్తున్న తీరు పలు సందర్భాల్లో బీబత్సమైన కామెడీ పండించిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేయటం గమనార్హం.