Home రాజకీయాలు బ్యాలెన్స్ తప్పరా!.. నిజాన్ని మీడియాతోనే చెప్పేసిన బాబు

బ్యాలెన్స్ తప్పరా!.. నిజాన్ని మీడియాతోనే చెప్పేసిన బాబు

2574
SHARE

చంద్రబాబు ఈ మధ్య కీలక విషయాలను కూడా నోరు జారి చెప్పేస్తున్నారు. సోనియా గాంధీని ఎదురించడంవల్లే జగన్‌పై కేసులు పెట్టారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాబు చెప్పారు.

అదేంటి ఇన్ని రోజులు అవినీతి చేయడంవల్లే జగన్‌పై కేసులు వచ్చాయని చెప్పి.. ఇప్పుడు హఠాత్తుగా సోనియా గాంధీని ఎదురించడం వల్లే కేసులు అని ఎలా చెబుతారని టీడీపీ నేతలు కంగుతిన్నారు. తాజాగా ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు.. అక్కడ మీడియాతో అసలు విషయం చెప్పేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చామని ప్రచారం చేయిస్తున్న చంద్రబాబు.. ఢిల్లీలో మాత్రం బీజేపీ వైసీపీని చేరదీస్తోందని అందుకే తాము బయటకు వచ్చామని చెప్పుకొచ్చారు. పీఎంవోను వైసీపీ వాడుకుంటోందని ఆరోపించారు. దీంతో పక్కనే ఉన్న టీడీపీ నేతలు కంగుతిన్నారు.

చంద్రబాబు నోరుజారి అసలు విషయం చెప్పేశారని షాక్‌ అయ్యారు. ఇంతకాలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో బంధం తెంచుకున్నామని ప్రచారం చేయించి.. ఇప్పుడు మాత్రం రాజకీయ కారణాలతోనే బంధం తెంచుకున్నామని చెప్పడం వల్ల ప్రతిపక్షాలు ఇంతకాలం చెబుతూ వస్తున్నట్టు రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారని ప్రజలు కూడా భావించే ప్రమాదముందని అభిప్రాయపడుతున్నారు.