Home రాజకీయాలు ఇంటెలిజెన్స్ అధికారిని కనిపెట్టి కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి

ఇంటెలిజెన్స్ అధికారిని కనిపెట్టి కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి

4004
SHARE

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ నిఘా ఉంచింది. ఈ విషయం ఢిల్లీలో మీడియా సమక్షంలోనే వెలుగులోకి వచ్చింది. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా.. ఒక ఇంటెలిజెన్స్ అధికారి .. విలేకరి తరహాలో వచ్చి నిలబడ్డారు.

విజయసాయిరెడ్డి ఏం మాట్లాడుతున్నారు.. మీడియా ప్రతినిధులతో ఆఫ్‌లైన్‌లో ఏఏ విషయాలు చెబుతున్నారు వంటిని క్రోడీకరించే ప్రయత్నం చేశారు. అయితే సదరు వ్యక్తి ఇంటెజిలెన్స్ అధికారి అని విజయసాయిరెడ్డి గుర్తుపట్టారు.

మీడియా సమావేశం మధ్యలోనే సదరు అధికారికి కౌంటర్‌ ఇచ్చారు. మీరు ఇంటెలిజెన్స్ అధికారి అన్న విషయం తెలుసు. మీరు వెంకటేశ్వరరావు పంపిన వ్యక్తి అని తెలుసు.

మీకు ఇక్కడ పని లేదు. మీరు వెళ్లిపోవచ్చు. ఏదైనా కావాలంటే నేరుగా అడుగు సమాధానం చెబుతా అంటూ కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి తనను కనిపెట్టడంతో సదరు ఇంటెలిజెన్స్ అధికారి అక్కడి నుంచి జారుకున్నారు.