Home రాజకీయాలు జగన్ పోరాటానికి సుప్రీం తోడు!

జగన్ పోరాటానికి సుప్రీం తోడు!

2240
SHARE

గత నాలుగేళ్లుగా ఓపికతో ఉంటూ, అధికారపక్షాలను నమ్ముకుంటూ వచ్చిన ఏపీవాసులకు అనుకున్నంత ప్రమాధం జరిగింది! నమ్ముకున్నవారి నిర్లక్ష్యం, చేతకానితనం ఏపీజనాలను నట్టేటముంచినంత పనిచేసింది. అయితే.. బాబు అండ్ కోలను ఏమాత్రం నమ్మని జగన్ మాత్రం… ఆ ఆశను ఈ నాలుగేళ్లూ సజీవంగా ఉంచుతూ వచ్చారు.. ఆది నుంచి ఆ అంశంపై పోరాడుతూనే ఉన్నారు.. అదే ప్రత్యేక హోదా! నాడు ఈ విషయంపై కప్పదాట్లువేసినవారే.. వెనక్కి తగ్గి “ప్రత్యేక హోదా కావాలి” అనే పరిస్థితి కల్పించారు. ఇది కచ్చితంగా జగన్ నైతిక విజయం అని, ప్రజా విజయం అనే అనుకోవాలి! అయితే తాజా పరిణామాల నేపథ్యంలో.. రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా అపఖ్యాతిని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక మంచిపని చేసింది! ఫలితంగా జగన్ పోరాటానికి పరోక్ష మద్దతు ఇచ్చినట్లయ్యింది. ఈ విషయంలో జగన్ తో బాబు కలిస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది.. రాష్ట్రానికి మంచి జరుగుతుంది.

వివరాళ్లోకి వస్తే… తెలుగు నేలను రెండు రాష్ట్రాలుగా విభజిస్తున్న సందర్భంగా రూపొందించిన విభజనచట్టంలో పేర్కొన్న హామీల అమలును ఏం చేశారంటూ సుప్రీంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత – ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి చేసిన పిటిషన్ పై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. అసలు విభజన చట్టంలో పేర్కొన్న హామీల్లో ఎన్నింటిని అమలు చేశారు? ఎన్ని అమలు చేయలేదు? అమలు చేయకపోవడానికి గల కారణాలేంటి? అన్న సమగ్ర వివరాలతో నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలతో కూడిన తాఖీదులు జారీ చేసింది! దీంతో కేంద్రం కచ్చితంగా స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే… ఈ పిటిషన్ కు ఏపీ అధికారపక్షంతో పాటు, హోదాపై అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్.. ఇంప్లీడ్ పిటిషన్ వేస్తే కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయమనే చెప్పాలి. ఈ విషయంలో ఏమాత్రం హెచ్చులకు పోని జగన్ ఆ దిశగా ఆలోచించినా… బాబు కలుస్తారా, లేక అవిశ్వాసం తీర్మానం విషయంలో చేసిందే చేస్తారా… వ్యక్తిగత ప్రతిష్ట కోసం తానే ఒక కొత్త పిటిషన్ వేస్తానని చెప్పుకొస్తారా అనేది వేచి చూడాలి!

ఏది ఏమైనా… తీవ్రస్థాయిలో పోరాడుతూ, రోజు రోజుకీ ఆ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తున్న వైకాపా ఎంపీల పోరాటానికి ఈ పిటిషన్ మరింత హెల్ప్ అవుతుందనే అనుకోవాలి. ఈ విషయంలో తెలుగు ఎంపీల పోరాటాలను ఏమాత్రం ఖాతరు చేయని ప్రధాని మోదీ… తాజాగా సుప్రీం జారీ చేసిన నోటీసులకు మాత్రం స్పందించక తప్పని పరిస్థితి. విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తే.. అమలు చేశామని చెప్పాలి.. అలాకానిపక్షంలో అమలు చేయకపోవడానికి గల కారణాలేమిటో కూడా చెప్పాలి. ఫలితంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తన వైఖరిని కేంద్రం, సుప్రీంకు తెలియజేయక తప్పదనే అనుకోవాలి. ఈ సంగతి విన్నవారు మాత్రం… జగన్ ఎంపీల అవిశ్రాంత పోరాటానికి సుప్రీం తాజా స్పందన చాలా హెల్ప్ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.