Home రాజకీయాలు ”నాపై ఆరోపణల్లో అవాస్తవాలు లేకపోయినా బురద…”-మళ్లీ జారిన లోకేష్

”నాపై ఆరోపణల్లో అవాస్తవాలు లేకపోయినా బురద…”-మళ్లీ జారిన లోకేష్

842
SHARE

మంత్రి నారా లోకేష్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. ఈ దేశంలో అవినీతి, కుల పిచ్చి, మతపిచ్చి, డబ్బు పిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీనే అవునా కాదా తమ్ముళ్లు అంటూ అప్పట్లో లోకేష్ కలకలం రేపారు. మరోసారి అంబేద్కర్ వర్థంతి శుభాకాంక్షలు చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాలను మంచినీరు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతా అని ఒక సందర్భంలో చెప్పారు. పీవీ నరసింహరావు టీడీపీ నుంచే ప్రధాని అయ్యారంటూ మరోసారి నవ్వుల పాలయ్యారు. మంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన లోకేష్ మరోసారి తడబడ్డారు. తనపై తీవ్ర స్థాయిలో వస్తున్న అవినీతి ఆరోపణలకు స్పందించిన లోకేష్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.

తాను ఎక్కడా లాలూచీపడలేదని చెప్పుకొచ్చారు. యువకుడినైన తనను అందరూ ప్రోత్సహించాలని సూచించారు. అంత వరకు బాగానే ఉన్నా.. లోకేష్ ఇంకో వ్యాఖ్య చేశారు. నాపై వస్తున్న ఆరోపణల్లో అవాస్తవం లేకపోయినా కొందరు బురదజల్లుతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఎమ్మెల్యేలు ఉలిక్కిపడ్డారు.

నాపై వస్తున్న ఆరోపణల్లో అవాస్తవం లేకపోయినా.. అని లోకేష్ వ్యాఖ్యానించడాన్ని కొందరు ఎమ్మెల్యేలు గమనించారు. దీంతో వెంటనే లోకేష్ గొంతు సవరించుకున్నారు. తనపై ఆరోపణలకు ఆధారాలుంటే పబ్లిక్‌లో చర్చకు పెట్టాలని కోరారు.