Home సినిమా ఆస్తులు పంచినట్లు క్రికెట్‌పై ప్రేమను పంచారు : జూ. ఎన్టీఆర్‌

ఆస్తులు పంచినట్లు క్రికెట్‌పై ప్రేమను పంచారు : జూ. ఎన్టీఆర్‌

SHARE

టాలీవుడ్‌ టాప్ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌, తండ్రులు ఆస్తులు పంచినట్లు క్రికెట్‌పై ప్రేమను పంచారని అభిప్రాయపడ్డారు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లకు తెలుగు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్‌ మంగళవారం పార్క్‌హయత్‌ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని స్టార్‌ మా రూపోందించిన ప్రచార వీడియోను విడుదల చేశారు.

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. క్రీడలకు సరిహద్దులు లేవన్నారు, ఎలాంటి గందరగోళం లేకుండా క్రీడల్లోనే మాట్లాడుకోవచ్చని తెలిపారు. ఇక క్రికెట్‌ అయితే మన రక్తంలో చేరి నరనరాల్లో జీర్ణీంచుకుపోయిందన్నారు. పెద్ద వాళ్లు ఆస్తులు పంచినట్లు క్రికెట్‌పై ప్రేమను కూడా పంచారన్నారు.

సచిన్‌ తన అభిమాన క్రికెటర్‌ అని, క్రికెటర్ల జీవితాలపై సినిమాలు రావడం ఆనందంగా ఉందన్నారు. అయితే క్రికెటర్ల బయోపిక్స్‌ చేయడానికి తాను సాహసించనని.. భవిష్యత్తులో తనకు ఏ ప్రాంచైజీని కొనే ఉద్దేశం లేదని పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ చెప్పుకొచ్చారు.