Home రాజకీయాలు ఆ వర్గాలకు జగన్ హీరో అయ్యారుగా!

ఆ వర్గాలకు జగన్ హీరో అయ్యారుగా!

SHARE

ఎవరు అవునన్నా కాదన్నా… తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం కాస్త కష్టాల్లో ఉందనే చెప్పుకోవాలి. ప్రత్యేక హోదా విషయంలో జగన్ చేస్తున్న పోరాటాలు, దాన్ని తీవ్రతరం చేయడానికి వేస్తున్న ఎత్తులు.. దేశ వ్యాప్తంగా హిందుత్వ పోకడలను పెంచిపోషిస్తున్నారనే విమర్శలు. ఇలా చెప్పుకుంటూపోతే 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీకి ఉన్న మద్దతు తాజాగా లేదనేవారే ఎక్కువ. ఈ క్రమంలో తాజాగా సుప్రీం కోర్టు వెలువరిచిన ఎస్సీ – ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వ్యవహారం అటు తిరిగీ ఇటు తిరిగి మోడీ మెడకే చుట్టుకునే ప్రమాధం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ కి దేశవ్యాప్తంగా ఉన్న బలహీనమైన ఓటు బ్యాంకులో దళితులు – గిరిజనులు – మైనారిటీలు అనేది అధికశాతం చెప్పే మాట. ఈ క్రమంలో తాజాగా సుప్రీం కోర్టు వెలువరిచి ఎస్సీ – ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబందించిన తీర్పు విషయంలో పరోక్షంగా మోడీ ఇరుకున పడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు రాజకీయ నాయకులు, పార్టీలు ఈ విషయంపై పెదవి విరుస్తున్న సంగతి. ఈ క్రమంలో తాజాగా ఈ తీర్పుకు సంబందించి మోడీకి ఒక లేఖ రాశారు వైకాపా అధినేత జగన్. ఈ లేఖలో జగన్ ప్రస్థావించిన అంశాలు ఇటు మోడీని ఇరుకున పెట్టడంతో పాటు అటు బాబు కూడా స్పందించాల్సిన పరిస్థితులు కల్పించిందనే చెప్పాలి.

ఈ క్రమంలో ఎస్సీ – ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునసమీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ రాష్ట్రపతి కోవింద్ – ప్రధాని మోదీలకు విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ సంధించారు. సుప్రీంకోర్టు తీర్టు ఎస్సీ – ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని అభిప్రాయపడిన జగన్.. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎస్సీ – ఎస్టీలు అభద్రతా భావానికి లోనవుతారని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ లేఖపై మోడీ అండ్ కో స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే ఎస్సీ – ఎస్టీ లు బీజేపీకి వ్యతిరేకం అన్న భావన బీజేపీ నేతల్లో కూడా ఉండటం దీనికి ప్రధాన కారణం. దేశంలో ఉన్న అధికశాతం ఓటు బ్యాంకు ఈ వర్గాలదే!

ఈ సందర్భంగా దళితుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గంలో మంత్రులకు దళితుల పట్ల ఉన్న అభిప్రాయాన్ని కూడా ప్రస్థావించారు మోడీ. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు – అదే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి గతంలో దళితుల విషయంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన జగన్… దళితుడిగా పుట్టాలని ఎవరూ కోరుకోరంటూ అంటూ బాబు వ్యాఖ్యలు చేస్తున్నారని, దళితులు అపరిశుభ్రంగా ఉంటారని మంత్రి ఆదినారాయణరెడ్డి అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను కించపరిచేలా పాలకులే మాట్లాడితే మిగిలిన వారి సంగతి ఏంటో మీరే ఆలోచించాలి అని జగన్ నొక్కి వక్కానించారు.

ఈ లేఖ ఏపీలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది! దళితులపట్ల ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వారిని కించపరిచేలా మాట్లాడటం.. అలాంటి తీర్పు వెలువడినప్పుడు తనస్థాయిలో తాను స్పందించకపోవడం.. మరోపక్క ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. ఈ లేఖపై రాష్ట్రపతి, ప్రధానులకు లేఖలు రాయడంతో దళితుల పట్ల ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉందనే విషయం తేటతెల్లమవుతుందనే కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. దళితుల ఓట్లు మాత్రమే బాబు అండ్ కో కు కావాలి కానీ, వారి అభివృద్ధి ప్రస్తుత ప్రభుత్వాలకు పట్టదనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ఎస్సీ – ఎస్టీ వర్గాల్లో జగన్ హీరో అయ్యారనే చెప్పాలి!