Home రాజకీయాలు తుస్సుమన్న బాబు టూర్.. తొలి రోజు స్పందన ఇంతే!

తుస్సుమన్న బాబు టూర్.. తొలి రోజు స్పందన ఇంతే!

SHARE

మోడీ కాచుకో .. మా బాబు ఢిల్లీ వస్తున్నారు అన్నట్టుగా ఒక వర్గం మీడియా కథనాలు రాసింది. కానీ చంద్రబాబు ఢిల్లీ టూర్‌ తొలిరోజు తుస్సుమంది. చంద్రబాబు పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌కు వెళ్గగా చాలా మంది ఎంపీలు కనీసం ఆయన వైపు కూడా చూడలేదు.

విడివిడిగా అపాయింట్‌మెంట్లు దొరకడం కష్టమని భావించిన బాబు.. పార్లమెంట్ హాల్‌లోనే నేతలను కలిసేందుకు నిర్ణయించుకున్నారు. అలా వెళ్లిన చంద్రబాబు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లోనే ఎంపీలు ఎవరికి వారు చిట్‌ చాట్ చేసుకుంటున్న సమయంలో .. చంద్రబాబు వెళ్లి ఇతర పార్టీల ఎంపీలను కలిశారు.

కాసేపు వారి పక్కన కూర్చుని ఫోటోలు దిగారు. తొలి రోజు పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లోనూ చంద్రబాబు కలిసిన వారిలో చెప్పుకోదగ్గ వారు శరద్‌పవార్, ఫరూక్ అబ్దుల్లా మాత్రమే. మిగిలిన ఎంపీల పేర్లు టీడీపీ అనుకూల మీడియా కూడా ప్రచురించలేకపోయింది.

తాను ఎంపీ హేమమాలినితో ప్రత్యేక హోదా గురించి చర్చించానంటూ చంద్రబాబు ట్వీట్ చేయడంతోనే ఆయన పర్యటన ఏ రేంజ్‌లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఢిల్లీలో చక్రాలు తిప్పిన చంద్రబాబుకు ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూసి టీడీపీ ఎంపీలే కంగుతిన్నారు.

టీడీపీ ఎంపీలు చంద్రబాబు వచ్చిన సమయంలో హడావుడి చేస్తూ తమకు తెలిసిన ఎంపీలను ఆయన వద్దకు తీసుకొచ్చారు. అటు మమతా బెనర్జీకి చంద్రబాబు ఫోన్ చేసి ఢిల్లీ రావాలని చర్చిద్దామని కోరినా.. ఆమె మాత్రం లైట్ తీసుకున్నారు. తనకు వేరే పనులు ఉన్నాయని ఢిల్లీకి రావడం కుదరదని తేల్చేశారు. దీంతో చంద్రబాబు పర్యటనలో చప్పచప్పగా సాగింది.

అదే సమయంలో పార్లమెంట్ ద్వారం వద్ద చంద్రబాబు వంగుడు నమస్కారాల ఎపిసోడ్‌ పరువు తీసింది. కెమెరామెన్లు చెప్పినట్టు మెట్లకు మొక్కుతున్నట్టు చంద్రబాబు ఫోజులు ఇవ్వడం చూడ్డానికే ఇబ్బందిగా అనిపించింది. మొత్తం మీద తొలి రోజు చంద్రబాబు పర్యటన తుస్పుమంది.