Home రాజకీయాలు పార్లమెంట్‌ వద్ద ఎబ్బేట్టుగా బాబు కృత్తిమ విన్యాసాలు

పార్లమెంట్‌ వద్ద ఎబ్బేట్టుగా బాబు కృత్తిమ విన్యాసాలు

SHARE

నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి కాపురం చేసి… ఇన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న అమరావతి నుంచి లీకులే పరిమితమైన చంద్రబాబు.. మరో రెండు రోజుల్లో పార్లమెంట్‌ ముగుస్తుందనగా ఢిల్లీ వెళ్లారు.

కొత్త పార్టనర్‌ను వెతుక్కునేందుకు ఆయన ఢిల్లీ వెళ్లినట్టు భావిస్తున్నారు. పార్లమెంట్‌ వద్దకు వచ్చిన చంద్రబాబు .. అక్కడ కృత్తిమంగా కొన్ని హావభావాలను ప్రదర్శించారు. కెమెరాల కోసమే చంద్రబాబు పాకులాడినట్టు స్పష్టంగా అర్తమైంది.

మొదట గాంధీ విగ్రహం వద్దకు వెళ్లిన చంద్రబాబు నివాళులర్పించి అనంతరం కెమెరాలకు ఫోజ్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. టీవీ కెమెరాల అన్ని ఒకే వైపు లేకపోవడంతో గాంధీ పాదాలకు నమస్కరిస్తున్న స్టిల్‌ను కుడి వైపు తిరిగి ఒకసారి, ఎడమ వైపు తిరిగి మరోసారి ఇచ్చారు చంద్రబాబు.

టీవీ కెమెరాల్లో తన దృశ్యం కనిపించేందుకు ఇలా సహకరించారు బాబు. ఇక పార్లమెంట్‌ ద్వారం వద్ద మెట్లకు మొక్కారు చంద్రబాబు. ఇక్కడ మరీ దారుణంగా ఫోజ్‌ ఇచ్చేశారు. నమస్కారించాల్సిన మెట్ల వైపు చూడకుండా ఒకవైపు తిరిగి కెమెరాలకు ఫోజ్ ఇచ్చారు.

తొలిసారి సరిగా పొజిషన్‌ లేదని చెప్పడంతో రెండోసారి అలాగే కెమెరాల వైపు చూస్తూ మెట్లకు నమస్కరించారు చంద్రబాబు. ఆ దృశ్యాలను చూస్తే పబ్లిసిటీ కోసం పాకులాడినట్టుగా ఉందే గానీ… భక్తితో నమస్కారాలు చేస్తున్నట్టు అస్సలు అనిపించలేదు.